Share News

AP Newws: ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించిన ఈసీ

ABN , Publish Date - Apr 04 , 2024 | 05:02 PM

మూడు జిల్లాల కలెక్టర్లు, ఐదు జిల్లాలకు ఎస్పీలను కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) గురువారం నాడు నియమించింది. కృష్ణా కలెక్టర్‌గా కె.బాలాజీ, అనంతపురం కలెక్టర్‌గా వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్‌లను ఈసీ నియమించింది.

AP Newws:  ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించిన ఈసీ

అమరావతి: మూడు జిల్లాల కలెక్టర్లు, ఐదు జిల్లాలకు ఎస్పీలను కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) గురువారం నాడు నియమించింది. కృష్ణా కలెక్టర్‌గా కె.బాలాజీ, అనంతపురం కలెక్టర్‌గా వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్‌లను ఈసీ నియమించింది.

అలాగే గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిఫాఠి, ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్, పల్నాడు ఎస్పీగా గరికపాటి బిందుమాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు, అనంతరపురం ఎస్పీగా అమిత్ బద్దార్, నెల్లూరు ఎస్పీగా అరీఫ్ హఫీజ్‌లను ఈసీ నియమించింది.

AP News: ఎన్నికల్లో మీకు ఎలా కావాలంటే ఆ విధంగా పనిచేస్తా..


ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు(గురువారం) రాత్రి ఎనిమిది గంటల్లోపు ఈ అధికారులు బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశించింది. రెండు రోజుల క్రితం ఐదు జిల్లాల ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీ, ముగ్గురు కలెక్టర్లను ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. అధికారులపై ఆరోపణల నేపథ్యలో వీరిని బదిలీ చేసి, కొత్తవారిని కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించింది.


Bhuvaneswari: కడపలో భువనేశ్వరి పర్యటన.. ఎండను కూడా లెక్క చేయకుండా...

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 04 , 2024 | 05:10 PM