-
-
Home » Andhra Pradesh » Breaking News September 4th Today Latest Telugu News Live Updates
-
Breaking News: నేటి తాజా వార్తలు..
ABN , First Publish Date - Sep 04 , 2024 | 07:19 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
Live News & Update
-
2024-09-04T14:10:32+05:30
మీడియాతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
బుడమేరు నది 90 శాతం ఆక్రమణకు గురయ్యింది.
గత ఐదేళ్లలో బుడమేరు పరిస్థితి దారుణంగా తయారైంది.
నేను కనిపించడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు
నేను బయటకు వస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది.
వైసీపీ నేతలు తీరు మార్చుకోవాలని పవన్ కల్యాణ్ హితవు

-
2024-09-04T13:36:02+05:30
వర్ష బీభత్సం
అమరావతి: వర్షాలతో 20 మంది మృతి
ఎన్టీఆర్ జిల్లాలో 12 మంది మృతి
గుంటూరులో ఏడుగురు, పల్నాడులో ఒకరు మృత్యువాత
1,69,370 ఎకరాల్లో పంట నష్టం
18424 ఎకరాల్లో ఉద్యానవన పంట నష్టం
-
2024-09-04T12:28:00+05:30
వరద బాధితులకు బీఆర్ఎస్ ఆర్థికసాయం
వరద బాధితులకు ఆదుకోవడానికి ముందకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ
ఖమ్మం వరద బాధితుల పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ దాతృత్వం
ఎమ్మెల్యేల, ఎంపీల ఒక నెల జీతం విరాళంగా ప్రకటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
కేసీఆర్ నిర్ణయాన్ని సిద్దిపేటలో ప్రకటించిన హరీష్ రావు
-
2024-09-04T12:10:45+05:30
వరదలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష
అమరావతి: పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష
వరదలపై అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు, గ్రామాల్లో తాగు నీరు, ఆహారం సరఫరా,
పారిశుద్ద్య నిర్వహణ వివరాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి తెలియజేసిన అధికారులు

-
2024-09-04T11:38:22+05:30
వైసీపీ నేతలకు చుక్కెదురు
అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసుల్లో వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ తిరస్కరణ
హైకోర్టు ఉత్తర్వులను రెండు వారాల పాటు సస్పెండ్ చేసి, సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన వైసీపీ నేతల తరపు న్యాయవాదులు
ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఉందని చెప్పిన న్యాయవాదులు
సుప్రీంకోర్టు తీర్పు అలా లేదని తీర్పు కాపీ ఇచ్చిన టీడీపీ న్యాయవాదులు
పరిశీలించి తుది ఉత్తర్వులు ఈ రోజు మధ్యాహ్నం ఇస్తామని పేర్కొన్న హైకోర్టు.

-
2024-09-04T11:02:43+05:30
రవిప్రకాశ్‌పై పరువు నష్టం కేసు
హైదరాబాద్: ఆర్టీవీ, రవిప్రకాశ్‌పై యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ రూ.100 కోట్లకు పరువు నష్టం దావా
కోర్టు ఫీజు రూ.కోటి (రూ.1,00,05,852) చెల్లింపు
1958 నుంచి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు (సీసీసీ) చరిత్రలో ఇదే అత్యధిక ఫీజు...
ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా పరువుకు భంగం కలిగించేలా కథనాలు ప్రసారం చేశారని కేసు
సమాజంలో అత్యంత గౌరవం కలిగిన తమపై నిరాధార కథనాలు ఖండిస్తున్నాం
ఆర్టీవీ, రవి ప్రకాశ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్
పిటిషన్‌పై మంగళవారం విచారణ. ప్రతివాది రవిప్రకాశ్‌కు సమన్లు జారీ.
వచ్చే నెల 16వ తేదీన కోర్టులో హాజరుకావాలని ఆదేశాలు జారీ
-
2024-09-04T10:28:33+05:30
తెలుగు రాష్ట్రాలకు మాజీ సీజేఐ విరాళం
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల వరద బాధితుల సహాయార్ధం విరాళం అందజేసిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిఎన్వీ రమణ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెరో 10 లక్షల రూపాయల చెక్ అందజేత
రెండు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లకు అందజేసిన మాజీ సీజేఐ ఎన్వీ రమణ
వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభినందించిన మాజీ సీజేఐ ఎన్వీ రమణ.

-
2024-09-04T10:10:43+05:30
తగ్గిన వరద
అమరావతి: ప్రకాశం బ్యారేజికి మరింత తగ్గిన వరద
నిన్న ఉదయం నుంచి క్రమేణా తగ్గుతున్న వరద
ఈ రోజు ఉదయం 9 గంటలకు బ్యారేజి వద్ద 4 లక్షల 56 వేల క్యూసెక్కులకు తగ్గిన వరద ఉధృతి
బ్యారేజి దిగువ భాగాన ముంపు నుంచి బయట పడుతున్న నది తీర గ్రామాలు
గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని పలు గ్రామాల్లో తగ్గిన వరద.
-
2024-09-04T09:17:28+05:30
వరదనీటిలోనే బాధితులు
అమరావతి: నాలుగు రోజులుగా వరండాలో జీవిస్తోన్న వరద బాధితులు
వరద నీటిలో విజయవాడ 15 డివిజన్ ప్రజలు
కాలనీ వదిలి బయటకు వస్తోన్న వేలాది మంది వరద బాధితులు
పలు కాలనీవాసులకు అందని సాయం
మెయిన్ రోడ్డు వరకే పరిమితమైన ఉన్నతాధికారులు
వరద తగ్గుముఖం పట్టిన సరిగ్గా స్పందించని అధికారులు
సందర్శకులను అదుపు చేయడంలో పోలీసుల విఫలం
-
2024-09-04T08:38:48+05:30
బాంబు బెదిరింపు కాల్
విశాఖ: ఢిల్లీ నుంచి విశాఖ వచ్చిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్
విశాఖ విమానాశ్రయంలో క్షుణ్ణంగా తనిఖీ చేస్తోన్న బాంబ్ స్క్వాడ్ అధికారులు
రాత్రి 8.55 గంటలకు ఢిల్లి వెళ్ళాల్సిన ఫ్లైట్
రాత్రి 12 గంటల తర్వాత విశాఖ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం
ఫోన్ కాల్ చేసిన ఆగంతకుడిని గుర్తించే పనిలో పోలీసులు
-
2024-09-04T08:30:40+05:30
మళ్లీ మొదలైన వాన
పశ్చిమ గోదావరి జిల్లా: తాడేపల్లిగూడెం పట్టణం, తాడేపల్లిగూడెం రూరల్, పెంటపాడు, గణపవరం, ఉంగుటూరు, నిడమర్రు మండలాల్లో రాత్రి నుండి ఎడతెరపి లేని వర్షం
భీమవరం, ఉండి పరిసర ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం
ఏజెన్సీలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పొంగుతున్న కొండ వాగులు
బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో పొంగుతున్న కొండ వాగులు
పొంగుతున్న కొండవాగులు దాటే ప్రయత్నం చేయొద్దని అధికారుల సూచన.
పొంగిన కొండవాగులతో ఏజెన్సీ ప్రాంతాలకు నిలిచిన రాకపోకలు
కొవ్వురు నియోజకవర్గంలో ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షం
తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు అంగన్‌వాడీ సెంటర్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించిన కలెక్టర్
-
2024-09-04T07:46:06+05:30
విజయసాయిరెడ్డికి జీవీఎంసీ షాక్
విశాఖపట్టణం: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి జీవీఎంసీ షాక్
భీమిలి బీచ్ వద్ద సీఆర్‌జడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రహరీ నిర్మాణం
ఉల్లంఘన పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వరస కథనాలు ప్రసారం
నేహా రెడ్డి సీఆర్‌జడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు
బీచ్‌లో కాంక్రీట్ నిర్మాణాలను అనుమతించొద్దని అధికారులకు హైకోర్టు ఆదేశాలు
నేహా రెడ్డికి ఈ నెల 2న జీవీఎంసీ నోటీసులు, 24 గంటల్లో ఆక్రమణలు తొలగించాలని ఆదేశం
ఆక్రమణలు తొలగించకుంటే.. మేమే తొలగిస్తామని స్పష్టీకరణ
ఈ రోజు ఉదయం భీమిలి బీచ్ వద్దకు చేరుకున్న జీవీఎంసీ అధికారులు
అక్రమ నిర్మాణాల కూల్చివేస్తోన్న సిబ్బంది
-
2024-09-04T07:30:30+05:30
శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద నీరు
నంద్యాల: శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద నీరు
జలాశయం 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత
ఇన్ ఫ్లో: 99,615 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 1,81,235 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుతం: 883.50 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం: 208.7 టీఎంసీలు
కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
-
2024-09-04T07:27:41+05:30
తుంగభద్ర డ్యామ్‌లోకి భారీగా వరదనీరు
కర్నూలు: 100 టీఎంసీలు దాటిన నీటి నిల్వ
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ
-
2024-09-04T07:19:25+05:30
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.