Share News

AP Maritime Board : మోటుపల్లిలో సహజ నౌకాశ్రయం ఏర్పాటుపై చర్చ

ABN , Publish Date - Dec 31 , 2024 | 05:38 AM

మారిటైమ్‌ సెంటర్‌ వృద్ధికి వివిధ మారిటైమ్‌ బోర్డులు, అసోసియేషన్లతో పాల్గొనడానికి ఇండియన్‌ మారిటైమ్‌ బోర్డు (ఐఎంసీ)లో సభ్యత్వం తీసుకోవాలని ఏపీ మారిటైమ్‌ బోర్డు నిర్ణయించింది.

AP Maritime Board : మోటుపల్లిలో సహజ నౌకాశ్రయం ఏర్పాటుపై చర్చ

అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మారిటైమ్‌ సెంటర్‌ వృద్ధికి వివిధ మారిటైమ్‌ బోర్డులు, అసోసియేషన్లతో పాల్గొనడానికి ఇండియన్‌ మారిటైమ్‌ బోర్డు (ఐఎంసీ)లో సభ్యత్వం తీసుకోవాలని ఏపీ మారిటైమ్‌ బోర్డు నిర్ణయించింది. సోమవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్యనారాయణ అధ్యక్షతన బోర్డు సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు విజన్‌కు అనుగుణంగా పోర్టుల అభివృద్ధి, పెట్టుబడుల కోసం కొత్త ప్రాంతాల అన్వేషణతో పాటు వివిధ అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు. మోటుపల్లిలో సహజ నౌకాశ్రయం ఏర్పాటు, పెద్దగంజాంలో నౌకా నిర్మాణ పరిశ్రమ అభివృద్ధికి సాధ్యాసాధ్యాలపై చర్చించారు. కృష్ణపట్నం ఓడరేవులో భద్రత కోసం కోస్ట్‌గార్డ్సుకు జెట్టీ కేటాయింపు, కొండపి నియోజకవర్గం పాకాలలో ఫిష్‌ ఇన్‌ల్యాండ్‌ సెంటర్‌ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు.

Updated Date - Dec 31 , 2024 | 05:38 AM