AP Politics: వైసీపీకి మరో షాక్.. శృంగవరపుకోట నియోజకవర్గంలో ఊహించని షాక్
ABN , Publish Date - Mar 03 , 2024 | 07:27 PM
ఏపీ అసెంబ్లీ (AP Assembly polls), లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి విపక్షాలైన టీడీపీ, జనసేనలో చేరారు. మరికొంతమంది చేరికకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో మరో ముఖ్యనేత కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పారు.
విజయనగరం: ఏపీ అసెంబ్లీ (AP Assembly polls), లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి విపక్షాలైన టీడీపీ, జనసేనలో చేరారు. మరికొంతమంది చేరికకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో మరో ముఖ్యనేత కూడా వైసీపీకి గుడ్‌బై చెప్పారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు సతీమణి సుధారాజు, శృంగవరపుకోట ఎంపీపీ సోమేశ్వరరావు, మేజర్ పంచాయితీ సర్పంచ్ సంతోషికుమారి, 18 మంది ఎంపీటీసీలు, 10 మంది సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు టీడీపీలో చేరేందుకు విజయవాడకు పయనమయ్యారు. వీరంతా టీడీపీలో చేరనుండడంతో అక్కడి అధికార వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.