Mobile Farmers Markets : నగర శివార్లకు సంచార రైతుబజార్లు
ABN , Publish Date - Dec 31 , 2024 | 06:09 AM
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ప్రధాన పట్టణాల్లోని శివారు ప్రాంతాల ప్రజలకు సంచార రైతుబజార్లను సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చినట్లు ఏపీ రైతుబజార్ల సీఈవో తెలిపారు.

అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ప్రధాన పట్టణాల్లోని శివారు ప్రాంతాల ప్రజలకు సంచార రైతుబజార్లను సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చినట్లు ఏపీ రైతుబజార్ల సీఈవో తెలిపారు. ‘సంచార రైతుబజార్ల ఏర్పాటు ఎప్పుడో?’ శీర్షికన ఈ నెల 28న ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై రైతుబజార్ల సీఈవో స్పందించారు. ప్రస్తుతమున్న 16 వాహనాలను రిపేరు చేయించి, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం నగర శివారు ప్రాంతాలతో పాటు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సంచార రైతుబజార్లుగా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో మరిన్ని సంచార రైతుబజార్లను అందుబాటులోకి తేవటానికి మార్కెటింగ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి, ప్రభుత్వానికి పంపుతున్నట్లు వివరించారు.