Share News

Scientists : రంగపూర్‌ చీనీ అంట్లు వాడండి

ABN , Publish Date - Jul 07 , 2024 | 12:00 AM

రంగపూర్‌ చీనీ అంట్లు వాడితే చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పలు రాష్ర్టాలకు చెందిన శాస్త్ర వేత్తల బృందం సూచించింది. స్థానిక డ్వామా సమావేశపు హాల్‌లో శని వారం ఉద్యాన పరిశోధన స్థానం రేకులకుంట ప్రధాన శాస్త్రవేత్త సుబ్ర హ్మణ్యంతో కలిసి పలు రాష్ర్టాల శాస్త్రవేత్తలు చీనీ పంట సాగు, సోకుతు న్న తెగుళ్లు, నివారణ చర్యలు తదితర అంశాలపై ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారులతో ఆరా తీశారు. జిల్లాలో సాగు చేస్తున్న చీనీ తోటలకు ఎండుకొమ్మ తెగులు, వేరు కుళ్లు...

Scientists : రంగపూర్‌ చీనీ అంట్లు వాడండి

శాస్త్రవేత్తల బృందం సూచన

జిల్లా చీనీ తోటల్లో తెగుళ్లపై ఆరా

అనంతపురం అర్బన, జూలై 6: రంగపూర్‌ చీనీ అంట్లు వాడితే చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పలు రాష్ర్టాలకు చెందిన శాస్త్ర వేత్తల బృందం సూచించింది. స్థానిక డ్వామా సమావేశపు హాల్‌లో శని వారం ఉద్యాన పరిశోధన స్థానం రేకులకుంట ప్రధాన శాస్త్రవేత్త సుబ్ర హ్మణ్యంతో కలిసి పలు రాష్ర్టాల శాస్త్రవేత్తలు చీనీ పంట సాగు, సోకుతు న్న తెగుళ్లు, నివారణ చర్యలు తదితర అంశాలపై ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారులతో ఆరా తీశారు. జిల్లాలో సాగు చేస్తున్న చీనీ తోటలకు ఎండుకొమ్మ తెగులు, వేరు కుళ్లు, పులుసు పురుగులు, బంక కారడం, కాండం కుళ్లు, పండు ఈగ సోకడంతో వంటి వ్యాధులు వస్తున్నట్లు వారికి ఉద్యాన అధికారులు వివరించారు. వర్షాభావ పరిస్థితుల


నేపథ్యంలో భూగర్భజలాలు తగ్గిపోవడంతో చెట్ల వేర్లకు సరిగా నీరు అందడం లేదని వారికి వివరించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తల బృందం సభ్యులు రాజేశ్వర్‌ సింగ్‌, వాస్కాసింగ్‌లు మాట్లాడుతూ... నర్సరీల్లో సర్టిఫైడ్‌ చీనీ మొక్కలు కొనుగోలు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. చీనీ తోటల సాగులో రైతుల సందేహాలు, అనుభవాలను క్రోడకీరించి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారులు కలిసి చీనీ పంట సాగుపై పాటించాల్సిన పద్ధతులపై కరపత్రం ముద్రించి క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అనంత ఉద్యాన శాఖ జిల్లా అధికారి ఫిరోజ్‌ ఖాన, శ్రీసత్య సాయి జిల్లా ఉద్యాన అధికారి చంద్రశేఖర్‌, శాస్త్రవేత్తలు చక్రవర్తి, రామ కృష్ణపాల్‌, ఏకే దాస్‌, తిరుం గనవేల్‌, ఉద్యాన పరిశోధన స్థానం రేకుల కుంట దత్తారెడ్డి, తిరుపతి చీనీ పరిశోన స్థానం శాస్త్రవేత్త శ్రీనివా్‌సరెడ్డి, అనంతరాజ్‌ పేట సీనియర్‌ శాస్త్రవేత్త వెంకటరమణ, భూగర్బజల శాఖ డీడీ తిప్పేస్వామి, ఉద్యాన అధికారులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 07 , 2024 | 12:11 AM