చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

ABN, Publish Date - Apr 13 , 2024 | 12:03 AM

చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని కూటమి శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి అన్నారు.

నార్పల, ఏప్రిల్‌ 12: చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని కూటమి శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి అన్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటీ సభ్యుడు ఆలం నరసానాయుడితో కలిసి ఆమె శుక్ర వారం మండలంలోని దుర్గం, సిద్దలాచెర్ల, గొల్లపల్లి, కమ్మకొట్టాల, మాలవాం డ్లపల్లి, దుగుమర్రి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు ఆలం వెంకట నరసా నాయుడు, ఆకుల ఆంజనేయు లు, పిట్టురంగారెడ్డి, ఆకుల నాగార్జున నాయుడు, ఎర్రినాగప్ప, ఆకుల తేజ పాల్గొ న్నారు. అలాగే బుక్కరాయసముద్రంలోని అనంతసాగర్‌ కాలనీ, విజయ నగర్‌ కాలనీలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి పర్వతనేని శ్రీధర్‌బాబు ప్రచారం నిర్వహించారు.

Updated at - Apr 13 , 2024 | 12:03 AM