Share News

AP ELECTIONS : కౌంటింగ్‌కు పటిష్ట చర్యలు

ABN , Publish Date - May 26 , 2024 | 12:14 AM

జేఎనటీయూలో జూన 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. ఎస్పీ గౌతమిశాలితో కలిసి కౌంటింగ్‌ ఏర్పాట్లు, భద్రతా చర్యలను శనివారం ఆయన పరిశీలించారు. కౌంటింగ్‌ ఏర్పాట్లను సమయానికి కన్నా ముందుగానే పూర్తి చేస్తున్నామని తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాలలోకి అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి ప్రత్యేక బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జేఎనటీయూలో భద్రతను మరింత పెంచడానికి మరిన్ని...

AP ELECTIONS : కౌంటింగ్‌కు పటిష్ట చర్యలు
The Collector, SP, is examining the counting arrangements

కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌

అనంతపురం టౌన, మే 25: జేఎనటీయూలో జూన 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. ఎస్పీ గౌతమిశాలితో కలిసి కౌంటింగ్‌ ఏర్పాట్లు, భద్రతా చర్యలను శనివారం ఆయన పరిశీలించారు. కౌంటింగ్‌ ఏర్పాట్లను సమయానికి కన్నా ముందుగానే పూర్తి చేస్తున్నామని తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాలలోకి అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి ప్రత్యేక బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జేఎనటీయూలో భద్రతను మరింత పెంచడానికి మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ఇక్కడి వ్యవహారాలన్నీ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి ఎస్పీ చూస్తూ.. పర్యవేక్షిస్తారని తెలిపారు. కౌంటింగ్‌ రోజు ఏజెంట్లు ఫోనలు, సిగరెట్లు, అగ్గి పెట్టెలు వంటివి తీసుకురాకూడదని అన్నారు. ప్రతి ఒక్కరినీ


పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి పంపుతామని అన్నారు. ఐడీ కార్డులు ఉన్నవారిని మాత్రమే లోపలికి పంపుతామని అన్నారు. వర్షం కురిసినా సా్ట్రంగ్‌రూమ్స్‌ తడవకుండా టార్పాలినలు ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాలలో టేబుల్స్‌, కుర్చీలు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్ల నియామక ఏర్పాట్లు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పరిశీలనకు వచ్చే ప్రతి ఒక్కరినీ, వారి వాహనాలను తనిఖీ చేశాకే అనుమతించాలని ఆదేశించారు. ఏజెంట్లకు షిఫ్టులవారీగా ఐడీ కార్డులు కేటాయించామని, ఆ సమయాలలోనే వారు పరిశీలనకు రావాలని సూచించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 26 , 2024 | 12:14 AM