రిజర్వ్ సిబ్బంది ఆందోళ న
ABN , Publish Date - May 12 , 2024 | 11:48 PM
పోలింగ్ రిజర్వ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. పోలింగ్ రోజున రిజర్వ్ స్టాఫ్ రావాలని అధికారులు ఆదేశించారు. ఉదయం నుంచే రిజర్వ్ సిబ్బంది డీఆర్సీ కార్యాలయం వద్ద వేచి ఉన్నారు. రిజర్వ్‌స్టా్‌ఫకు పోలింగ్ కేంద్రాలను అధికారులు కేటాయించలేదు.

ఉరవకొండ,మే12: పోలింగ్ రిజర్వ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. పోలింగ్ రోజున రిజర్వ్ స్టాఫ్ రావాలని అధికారులు ఆదేశించారు. ఉదయం నుంచే రిజర్వ్ సిబ్బంది డీఆర్సీ కార్యాలయం వద్ద వేచి ఉన్నారు. రిజర్వ్‌స్టా్‌ఫకు పోలింగ్ కేంద్రాలను అధికారులు కేటాయించలేదు. మీ అవసరం లేదని తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. ఈ సమయంలో వెళ్లిపోవాలని చెప్పడంతో రవాణా సౌకర్యం కూడా లేదని, తాము ఎలా వెళ్లాలంటూ అధికారులతో సిబ్బంది వాగ్వాదానికి దిగారు. అనంతపురం వరకూ మాత్రమే బస్సు సౌకర్యం కల్పిస్తామంటే మిగిలిన ప్రాంతాలకు ఎలా వెళ్లాలని అధికారులను నిలదీశారు. అధికారుల తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. అనంతపురం నుంచి తాడిపత్రి, శింగనమల, రాయదుర్గం ప్రాంతాలకు ఎలా వెళ్లేదని మహిళా సిబ్బంది వాపోయారు. ప్రత్యామ్నాయ చర్యలు ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో విరమించారు.