రాజంవాండ్లపల్లిలో అదుపులో విష జ్వరాలు
ABN, Publish Date - Aug 01 , 2024 | 11:38 PM
మండలంలోని రాజంవాండ్లపల్లి గ్రామంలో వైరల్ జ్వరాలు అదుపులో ఉన్నట్లు వైద్యాధికారిణి కల్పన గురువారం తెలిపారు. ఈ గ్రామంలో పలువురు సీజనల్ వ్యాధుల బారిన పడటంతో పది రోజుల క్రితం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు
నల్లచెరువు, ఆగస్టు 1: మండలంలోని రాజంవాండ్లపల్లి గ్రామంలో వైరల్ జ్వరాలు అదుపులో ఉన్నట్లు వైద్యాధికారిణి కల్పన గురువారం తెలిపారు. ఈ గ్రామంలో పలువురు సీజనల్ వ్యాధుల బారిన పడటంతో పది రోజుల క్రితం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్థులకు వైద్య చికిత్సలతో పాటు మందులు అందిస్తున్నామని, ప్రస్తుతం జ్వర కేసులు ఏవీ నమోదు కాలేదని తెలిపారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వెంటనే తమను సంప్రదించాలని సూచించారు. గ్రామంలో పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచఓ రామచంద్రారెడ్డి, సూపర్‌వైజర్ సుధాకర్, ఎంఎల్‌హెచపీ గాయత్రి, ఎఎనఎం ఈశ్వరమ్మ, మున్నా, శ్రీనివాసులరెడ్డి, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
Updated at - Aug 01 , 2024 | 11:38 PM