Share News

YCP : పెద్దమ్మ తల్లికి నూటొక్క టెంకాయ

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:30 AM

సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం అర్బన వైసీపీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఓడిపోయారు. దీంతో అదే పార్టీకి చెందిన రుద్రంపేట ఉప సర్పంచు నరేంద్రరెడ్డి పెద్దమ్మ తల్లికి శుక్రవారం 101 టెంకాలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. అనంతపురం నగరంలోని జిల్లా రిజిస్ట్రేషన కార్యాలయం సమీపంలో ఉన్న ఆలయం వద్ద ఆయన టెంకాయలు కొట్టడం వైసీపీపై సొంత పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తికి అద్దం పట్టింది. అనంత వెంకటరామిరెడ్డి ఓడిపోవాలని తాను పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నాననీ, ఆయన ...

YCP : పెద్దమ్మ తల్లికి  నూటొక్క టెంకాయ
Rudrampet sub-sarpanch Narendra Reddy beating tenkayas at Peddamma temple in the city

అనంత ఓటమితో మొక్కు

తీర్చుకున్న వైసీపీ ఉప సర్పంచ

అనంతపురం రూరల్‌, జూన 7: సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం అర్బన వైసీపీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఓడిపోయారు. దీంతో అదే పార్టీకి చెందిన రుద్రంపేట ఉప సర్పంచు నరేంద్రరెడ్డి పెద్దమ్మ తల్లికి శుక్రవారం 101 టెంకాలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. అనంతపురం నగరంలోని జిల్లా రిజిస్ట్రేషన కార్యాలయం సమీపంలో ఉన్న ఆలయం వద్ద ఆయన టెంకాయలు కొట్టడం వైసీపీపై సొంత పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తికి అద్దం పట్టింది. అనంత


వెంకటరామిరెడ్డి ఓడిపోవాలని తాను పెద్దమ్మ తల్లికి మొక్కుకున్నాననీ, ఆయన ఓటమితో అమ్మవారికి మొక్కు చెల్లించానని నరేంద్ర రెడ్డి తెలిపారు. గత ఎన్నికల్లో అనంత వెంకటరామిరెడ్డి కోసం పనిచేసిన నరేంద్ర రెడ్డి.. పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయనతో విభేదించారు. బహిరంగ విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో అనంతను ఓడించాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాలకు కూడా మొక్కుబడిగా వెళ్లేవారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 08 , 2024 | 12:30 AM