Share News

CRIME : అయ్యో.. ఎంత ఘోరం..!

ABN , Publish Date - Jul 21 , 2024 | 12:36 AM

అన్నదమ్ముల బిడ్డలు..! అక్క, తమ్ముడు..! అన్యోన్యంగా ఉండేవారు. కలిసి బడికి వెళ్లేవారు. ఇంట్లో ఎవరో ఒకరు వారిద్దరినీ బైక్‌పై ఎక్కించుకుని బడిలో దించేవారు. సాయంత్రం తిరిగి ఇంటికి పిలుచుకొచ్చేవారు. సేద్యం చేసుకునే ఆ అన్నదమ్ములిద్దరూ.. తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని.. ఊరికి దూరంగా.. పట్టణంలో ఉన్న ప్రైవేటు పాఠశాలకు పంపించేవారు. కానీ విధి మరోలా తలచింది. ఆ ఇద్దరు చిన్నారులను ఇసుక ట్రాక్టర్‌ రూపంలో మృత్యువు కబళించింది. వారి ఇంట అంతులేని విషాదాన్ని నింపింది....

CRIME : అయ్యో.. ఎంత ఘోరం..!
Varuntej, Spandan (File)

బైకును ఢీకొన్న ఇసుక ట్రాక్టర్‌

బడికి వెళుతున్న అక్కాతమ్ముడి మృతి.. ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేస్తుండగా ప్రమాదం

అన్నదమ్ముల బిడ్డలు..! అక్క, తమ్ముడు..! అన్యోన్యంగా ఉండేవారు. కలిసి బడికి వెళ్లేవారు. ఇంట్లో ఎవరో ఒకరు వారిద్దరినీ బైక్‌పై ఎక్కించుకుని బడిలో దించేవారు. సాయంత్రం తిరిగి ఇంటికి పిలుచుకొచ్చేవారు. సేద్యం చేసుకునే ఆ అన్నదమ్ములిద్దరూ.. తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని.. ఊరికి దూరంగా.. పట్టణంలో ఉన్న ప్రైవేటు పాఠశాలకు పంపించేవారు. కానీ విధి మరోలా తలచింది. ఆ ఇద్దరు చిన్నారులను ఇసుక ట్రాక్టర్‌ రూపంలో మృత్యువు కబళించింది. వారి ఇంట అంతులేని విషాదాన్ని నింపింది.

గుమ్మఘట్ట, జూలై 20: మండల పరిధిలోని ఎస్‌.కొత్తపల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తమ మామ సురే్‌షతో కలిసి బైక్‌మీద బడికి వెళుతుండగా ఇసుక ట్రాక్టర్‌ ఢీకొనడంతో వరుణ్‌ తేజ్‌(8), స్పందన(11) ప్రాణాలు కోల్పోయారు. దీంతో బాధిత కుటుంబం, గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎస్‌.కొత్తపల్లికి చెందిన కురుబ


మల్లికార్జున, మల్లేష్‌ సోదరులు వ్యవసాయం చేసుకుంటూ తమ బిడ్డలను చదివిస్తున్నారు. రాయదుర్గం పట్టణంలోని నారాయణ పాఠశాలలో మల్లికార్జున కుమారుడు వరుణ్‌తేజ్‌ మూడో తరగతి, మల్లేష్‌ కూతురు స్పందన ఐదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరనీ కుటుంబసభ్యులు రోజూ బైక్‌ మీద బడికి తీసుకువెళ్లేవారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం ఇద్దరు చిన్నారులను మామ సురేష్‌ తన బైక్‌పై ఎక్కించుకుని బయలుదేరాడు. గ్రామ సమీపంలో భూపసముద్రం హగరి నుంచి ఇసుక ట్రాక్టర్‌ రాయదుర్గం వైపు వెళుతుండగా.. ఓవర్‌ టేక్‌ చేయబోయాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ ట్రాలీ తగలడంతో బైకు అదుపుతప్పి కింద పడింది. వరుణ్‌తేజ్‌ అక్కడికక్కడే మృతిచెందగా, స్పందన తీవ్రంగా గాయపడింది. వైద్యం కోసం అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. సురే్‌షకు స్వల్ప గాయాలయ్యాయి. గుమ్మఘట్ట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ప్రమాద స్థలానికి చేరుకుని ట్రాక్టర్‌ను స్వాధీనం తీసుకున్నారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 21 , 2024 | 12:36 AM