Bibi Fatima : సందడే సందడి..!
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:56 AM
బీబీ ఫాతిమా బ్రహ్మోత్సవాల్లో భాగంగా నగరంలోని ఐదో రోడ్డులో శనివారం సాయంత్రం పెద్ద సరిగెత్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీబీ ఫాతిమా పీర్లను సాయంత్రం నుంచి రాత్రి వరకూ వేలాది మంది భక్తులు దర్శించుకుని, చక్కెర చదివించి మొక్కు తీర్చుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటైన తినుబండారాలు, ఆటవస్తువుల దుకాణాలు కిటకిటలాడాయి. ఉత్సవ నిర్వాహకులు..

ఘనంగా బీబీ ఫాతిమా పెద్ద సరిగెత్తు
భక్తులతో కిటకిటలాడిన ఐదో రోడ్డు
బీబీ ఫాతిమా బ్రహ్మోత్సవాల్లో భాగంగా నగరంలోని ఐదో రోడ్డులో శనివారం సాయంత్రం పెద్ద సరిగెత్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీబీ ఫాతిమా పీర్లను సాయంత్రం నుంచి రాత్రి వరకూ వేలాది మంది భక్తులు దర్శించుకుని, చక్కెర చదివించి మొక్కు తీర్చుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటైన తినుబండారాలు, ఆటవస్తువుల దుకాణాలు కిటకిటలాడాయి. ఉత్సవ నిర్వాహకులు మల్లికార్జున, నరసింహులు, కేఎస్ మురళి, కిశోర్, మహేష్, చంద్రశేఖర్, అజ్జి,
తిమ్మప్ప తదితరులు పర్యవేక్షించారు. పాతూరులో మొహర్రం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీర్ల ఊరేగింపుతో మార్కెట్ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. యువత, చిన్నారులు గంధం చల్లుకుంటూ, డప్పు శబ్దాలకు అనుగుణంగా చిందులు తొక్కారు. - అనంతపురం కల్చరల్
మరిన్ని అనంతపురం వార్తల కోసం....