Share News

Hindupur: కన్నుల పండువగా లక్ష్మీ నారసింహుడి కల్యాణం

ABN , Publish Date - May 21 , 2024 | 11:47 PM

పట్టణ పరిధిలోని నింకంపల్లిలో వెలసిన లక్ష్మీనారసింహస్వామి కల్యాణం కన్నుల పండువగా సాగింది. తెల్లవారుజాము నుంచే మూల విరాఠ్‌కు వివిధ అభిషేకాలు అర్చనలు నిర్వహించారు.

Hindupur: కన్నుల పండువగా లక్ష్మీ నారసింహుడి కల్యాణం
Lakshmi narasimha swamy Kalyanam doing by pandits

హిందూపురం అర్బన, మే 21: పట్టణ పరిధిలోని నింకంపల్లిలో వెలసిన లక్ష్మీనారసింహస్వామి కల్యాణం కన్నుల పండువగా సాగింది. తెల్లవారుజాము నుంచే మూల విరాఠ్‌కు వివిధ అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. అనంతరం మంగళవారం క్రోధినామ సంవత్సరం వైశాఖశుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మేళాతాళాలు మంగళ వాయిద్యాలతో కల్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. ఉదయం 9.30 నుంచి స్వామివారి కల్యాణం, 1 గంటకు మంత్రపుష్పం, మహానైవేద్యం, మహామంగళహారతి అందించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కల్యాణాన్ని తిలకించారు. బుధవారం కలశవాహనాది, అగ్ని కార్యాది హవనములు, 9 నుంచి 10 గంటలకు పూర్ణాహుతి, 10.30 గంటలకు మహిళలచే దీపోత్సవం, అనంతరం స్వామివారికి విశేష మంత్రపుష్పం, మహానైవేద్యం, మహామంగళహారతి, తీర్థప్రసాద వినియోగం, 4 గంటల నుంచి ప్రత్యేక వాహనంలో స్వామి వారి ఉత్సవ విగ్రహంతో నగరోత్సవం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో అర్చకులు వేణునాథన, యజ్ఞాచార్యలు చక్రపాణి ఆచార్యులు, ఆలయ అధ్యక్షుడు నాగరాజు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


విద్యానగర్‌లో: పట్టణ పరిధిలోని విద్యానగర్‌లో వెలసిన లక్ష్మీ వేంకటేవ్వరస్వామి ఆలయ 10వ వార్షికోత్సవనిఇ్న పురస్కరించుకొని మంగళవారం కల్యాణ వేడుకలు రమనీయంగా సాగాయి. మూలవిరాఠ్‌కు వివిధ అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణలతో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని జరిపించారు. సాయంత్రం పురవీధుల్లో దేవతామూర్తుల విగ్రహాలతో నగరోత్సవం నిర్వహించారు.

Updated Date - May 21 , 2024 | 11:47 PM