Share News

PRESSMEET: ఆదివాసీలను చంపడం దారుణం

ABN , Publish Date - May 26 , 2024 | 11:50 PM

ఛత్తీ్‌సఘడ్‌లో ఆపరేషన కగార్‌ పేరిట ఐదునెలలుగా ఆదివాసీలను చంపడం దారుణమని పలు ప్రజా సంఘాలు పేర్కొన్నాయి. పట్టణంలోని నెహ్రూపార్కులో ఆదివారం ఏర్పాటుచేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పలువురు మాట్లాడుతూ అరణ్యంలో ఆపరేషన కగార్‌ పేరిట ఆదివాసీలను హతమార్చడం ఏంటని ప్రశ్నించారు.

PRESSMEET: ఆదివాసీలను చంపడం దారుణం
Chiranjeevi sepeeking in press meet

తాడిపత్రిటౌన, మే 26: ఛత్తీ్‌సఘడ్‌లో ఆపరేషన కగార్‌ పేరిట ఐదునెలలుగా ఆదివాసీలను చంపడం దారుణమని పలు ప్రజా సంఘాలు పేర్కొన్నాయి. పట్టణంలోని నెహ్రూపార్కులో ఆదివారం ఏర్పాటుచేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పలువురు మాట్లాడుతూ అరణ్యంలో ఆపరేషన కగార్‌ పేరిట ఆదివాసీలను హతమార్చడం ఏంటని ప్రశ్నించారు. పైగా ఆదివాసీలను మావోయిస్టులు చంపారంటూ కేంద్రప్రభుత్వం ప్రచారం చేస్తోందన్నారు. కార్పొరేట్‌ శక్తులు, పెట్టుబడిదారులకు వన్యసంపదను దోచిపెడుతోందని ఆరోపించారు. బూటకపు ఎనకౌంటర్లకు పాల్పడుతూ ఇబ్బందులపాలు గురిచేస్తున్నారని తెలిపారు. సమావేశంలో పౌరహక్కుల సంఘం కార్యదర్శి ఆదినారాయణ, సహాయ కార్యదర్శి శ్రీరామమూర్తి, సీపీఐ పట్టణ కార్యదర్శి చిరంజీవియాదవ్‌, సహాయ కార్యదర్శులు శ్రీరాములు, రత్నమయ్య, నాగేంద్ర, వృత్తిదారుల సంఘం నియోజకవర్గ కార్యదర్శి సాలవేముల సూరి, ప్రజా కళా మండలి నాయకులు విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2024 | 11:50 PM