Share News

Farmers: విద్యుత స్తంభాల ఏర్పాటును అడ్డుకున్న రైతులు

ABN , Publish Date - May 27 , 2024 | 11:55 PM

మండలంలోని గడేకల్లు గ్రామంలో నిర్మాణం చేపట్టిన విద్యుత పనులను ఆ గ్రామ రైతలు అడ్డుకున్నారు. మండలంలోని గడేకల్లు గ్రామంలో రూ.కోటితో నూతన విద్యుత సబ్‌స్టేషన నిర్మాణం చేపట్టారు. దీనికి విద్యుత సరఫరా కొసం దాదాపుగా 3 కి.మీ మేర విద్యుత స్తంభాలు ఏర్పాటు చేసి గడేకల్లు ఫీడర్‌ కింద ఉన్న గ్రామాలకు విద్యుత అందివ్వాల్సి ఉంది.

Farmers: విద్యుత స్తంభాల ఏర్పాటును అడ్డుకున్న రైతులు
Substaion Under construction

అనుమతి లేకుండా ఎలా నాటుతారని నిలదీత

పనులు నిలిపివేసిన అధికారులు

విడపనకల్లు, మే 27: మండలంలోని గడేకల్లు గ్రామంలో నిర్మాణం చేపట్టిన విద్యుత పనులను ఆ గ్రామ రైతలు అడ్డుకున్నారు. మండలంలోని గడేకల్లు గ్రామంలో రూ.కోటితో నూతన విద్యుత సబ్‌స్టేషన నిర్మాణం చేపట్టారు. దీనికి విద్యుత సరఫరా కొసం దాదాపుగా 3 కి.మీ మేర విద్యుత స్తంభాలు ఏర్పాటు చేసి గడేకల్లు ఫీడర్‌ కింద ఉన్న గ్రామాలకు విద్యుత అందివ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా విద్యుత అధికారులు కొత్త సబ్‌ స్టేషన నుంచి రైతుల పొలాలు మీదుగా 3 కి.మీ విద్యుత స్తంభాలు పాతిపెట్టేందుకు పొలాల్లో సిద్ధం చేసి ఉంచారు. విషయం తెలుసుకున్న రైతులు పొలాల్లోకి వెళ్లి విద్యుత స్తంభా లు ఏర్పాటు చేయరాదని అడ్డుకున్నారు. ఎన తిమ్మపురం రోడ్డుకు కేవలం నాలుగు విద్యుత స్తంభా లు సరిపడే దూరంలో 33/11కేవీ విద్యుత లైన ఉన్నా వైసీపీ నాయకులుకు మేలు చేకూరే విధంగా రాజకీయం చేశారని రైతులు వాపోయారు. వైసీపీకి చెందిన మంత్రి అండతోనే రైతుల పొలాల్లో విద్యుత స్తంభాలు నాటేందుకు(ఏర్పాటుకు) సాహసం చేశారన్నారు.


మా పొలాలు 63వ జాతీయ రహదారికి పక్కనే ఉండటంతో భవిష్యత్తులో పొలాలు విలువలు పెరుగుతాయని విద్యుత లైన్లు పొలాల్లో వెళితే విలువ తగ్గిపోయి నష్టాలపాలు అవుతామని ఆవేదన చెందారు. రైతుల అనుమతులు లేకుండా పొలాల్లో విద్యుత లైన్లు ఏర్పాటు చేస్తే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. దీంతో అధికారులు పనులు నిలిపివేశారు. దీనిపై విద్యుత ఏఈ సత్యంను వివరణ కోరగా గడేకల్లు ఫీడర్‌ పరిధిలో లో-వోల్టేజ్‌ సమస్య అధికంగా ఉండటంతో దాన్ని అధిగమించేందుకు నూతన సబ్‌ స్టేషనను నిర్మించి విద్యుత లైన్లను ఏర్పాటు చేయాలని పొలాల్లో విద్యుత స్తంభాలు సిద్ధ చేశామన్నారు. కాని రైతులు వారి పొలాల్లో విద్యుత స్తంభాలు ఏర్పాటు చేస్తే నషపోతామని అడ్డుకున్నారు. మరోసారి రైతులతో చర్చించి వారిని ఒప్పించి స్తంభాలు ఏర్పాటు చేస్తామన్నారు.

Updated Date - May 27 , 2024 | 11:55 PM