AP ELECTIONS : పొరపాట్లు చేయకండి
ABN , Publish Date - Jun 03 , 2024 | 12:12 AM
ఎక్కడా ఎలాంటి పొరపాట్లు చేయకుండా, నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్ పక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధాకారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా అధికారులను ఆదేశించారు. కౌంటింగ్, భద్రతా చర్యలపై తీసుకున్న చర్యలు గురించి ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ హాల్‌లో ఏచిన్న గొడవ జరగకూడదని, ఎవరైన కావాలని చేస్తే వారిపై చట్టప్రకారం ...
కచ్చితమైన ఫలితాలు ప్రకటించాలి
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా
అనంతపురం టౌన, జూన 2: ఎక్కడా ఎలాంటి పొరపాట్లు చేయకుండా, నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్ పక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధాకారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా అధికారులను ఆదేశించారు. కౌంటింగ్, భద్రతా చర్యలపై తీసుకున్న చర్యలు గురించి ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ హాల్‌లో ఏచిన్న గొడవ జరగకూడదని, ఎవరైన కావాలని చేస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ఫలితాలు కచ్చితమైన
సమాచారంతో ప్రకటించాలన్నారు. రౌండ్ల వారీగా పలితాల సమాచారాన్ని ఎప్పటికపుడు యాప్‌లో నమోదు చేయాలన్నారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక భద్రత చేపట్టి శాంతి భద్రతలు పరిరక్షించాలని ఆదేశించారు.
సర్వం సిద్ధం చేశాం:కలెక్టరు
జిల్లాలో కౌంటింగ్ నిర్వహణకు జేఎనటీయూలో ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు వినోద్ కుమార్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వివరించారు. ఎన్నికల కమిషన నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ మైఖోమ్‌నిదియా, నగరపాలక కమిషనర్ మేఘస్వరూప్, అసిస్టెంట్ కలెక్టరు వినూత్న, రిటర్నింగ్ ఆఫీసర్లు రాణిసుష్మిత, శ్రీనివాసులురెడ్డి, వసంతబాబు, వెంకటేష్, శిరీషా, వెన్నెలశ్రీను, పలువురు నోడల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఏజెంట్లు నేడే రావాలి
ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఆయా రాజకీయ పార్టీల తరపున నియమితులైన ఏజెంట్లు సోమవారం రాత్రికే అనంతపురం నగరానికి చేరుకోవాలని కలెక్టరు వినోద్‌కుమార్ తెలిపారు. ఆర్‌ఓలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు ఎక్కడా పెండింగ్‌లేకుండా చూసుకోవాలన్నారు. కౌంటింగ్ సమయంలో సమస్యలు సృష్టించినా, వాయి్‌సపెంచినా అలాంటి ఏజెంట్లను వెంటనే బయటకు పంపించాలన్నారు. ఏజెంట్లు తప్ప నగరంలో బయటి ప్రాంతాల వ్యక్తులు ఉండకూడదన్నారు. లాడ్జీలు, కమ్యూనిటీహాళ్లు, షాదీఖానాలలో ఎవరైన ఉంటే వారి ఐడీ కార్డులను పరిశీలించాలని, ఇతరులు ఉంటే అక్కడ నుంచి పంపించాలని పోలీసులకు సూచించారు. జేఎనటీయూ సమీపంలో ఇళ్లు ఉన్న వారికీ ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, ఇతరులను ఆరోజు ఇళ్లలో ఉంచుకోరాదన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....