TDP: అభివృద్ధే టీడీపీ తారకమంత్రం: అశ్మిత రెడ్డి
ABN , Publish Date - Apr 30 , 2024 | 11:51 PM
అభివృద్ధే టీడీపీ తారకమంత్రమని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి అన్నారు. పట్టణంలోని దళిత వాడలో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాడిపత్రిటౌన, ఏప్రిల్30: అభివృద్ధే టీడీపీ తారకమంత్రమని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి అన్నారు. పట్టణంలోని దళిత వాడలో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన నియోజకవర్గ కన్వీనర్ కదిరి శ్రీకాంతరెడ్డి, విజ్జి, టీడీపీ, బీజేపీ నాయకులు హరినాథ్‌రెడ్డి, పవనకుమార్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, దినేష్‌రెడ్డి, రంగనాథరెడ్డి, గంగాధర్, ఆంజనేయులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫ్యానకు ఓటువేస్తే ఆస్తులు గోవింద..
పెద్దవడుగూరు: వచ్చే ఎన్నికల్లో ఫ్యాన గుర్తుకు ఓటువేస్తే ప్రజల ఆస్తులు గోవిందా అని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మండలకేంద్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో జేసీపీఆర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిందన్నారు. యాక్ట్ ప్రధాన ఉద్దేశం భూములు రీసర్వే చేసి హక్కుదారులను నిర్దేశిస్తారన్నారు. ఈ భూములపై రెండేళ్లపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారని తెలిపారు. గడువు దాటితే అభ్యంతరం చెప్పే వీలుకూడా ఉండదని చెప్పారు. జిల్లా ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, మండల కన్వీనర్ కొండూరు కేశవరెడ్డి, నాయకులు దివాకర్‌రెడ్డి, గంగరాజుయాదవ్, చిన్నగోవిందు, రమేష్‌యాదవ్, హరికృష్ణారావు, నాగరాజు, సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
పెద్దపప్పూరు: మండలంలోని జూటూరు గ్రామంలో మంగళవారం కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు ఆయన వివరించారు. తెలుగుయువత ఉపాధ్యక్షుడు లోకనాథ్‌రెడ్డి, చిత్తరంజనరెడ్డి, జగన్నాథరెడ్డి, శశిధర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, వెంకటశివారెడ్డి, మండల కన్వీనర్ గుర్తి రఘునాయుడు పాల్గొన్నారు.
టీడీపీలో చేరిక: మండలంలోని భీమునిపల్లి గ్రామానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన బసిరెడ్డి, పెద్దిరెడ్డి, కాయల గరుడశేఖర్‌రెడ్డి, హరిజన, చంద్ర, కంబయ్య, ఎర్రకంబయ్య, రామ్మూర్తి, చిన్నకంబయ్యలకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ నాయకులు చవ్వా గోపాల్‌రెడ్డి, పుట్లూరు లక్ష్మికాంతరెడ్డి, మాజీ ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, ఆరెకటిక రాష్ట్ర కన్వీనర్ హరికృష్ణారావు, రంగనాయకులు, రంగస్వామి పాల్గొన్నారు.
రాబోయేది కూటమి ప్రభుత్వమే
పుట్లూరు: వచ్చే ఎన్నికల్లో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని టీడీపీనేత జేసీ పవనరెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పుట్లూరు పుల్లారెడ్డి, కులశేఖర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, పవనకుమార్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, రవికుమార్‌రెడ్డి, శ్రీనివాసులునాయుడు, రామాంజనేయులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..