Papaya trees : బొప్పాయి చెట్ల నరికివేత
ABN , Publish Date - Jun 30 , 2024 | 11:09 PM
మండలంలోని మన్నీల గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి ఓ రైతు సాగు చేసిన బొప్పాయి చెట్లు నరికివేశారు. బత్తపల్లి మండలం ఎర్రాయిపల్లికి చెందిన వెంకటరాముడు మన్నీల గ్రామ పొలం సర్వే నెంబరు 47లోని 4.8 ఎకరాల్లో ఉన్న భూమిలో బొప్పాయి పంట సాగు చేశాడు. ఆరు నెలల కిందట దాదాపు రూ.ఏడు లక్షల పెట్టుపెట్టి ఐదు వేల మొక్కలు నాటాడు. పంట కూడా చేతికొచ్చే దశలో ఉంది. మరో ఇరవై రోజుల్లో పంట ...
దాదాపు రూ. రెండు లక్షల నష్టం
అనంతపురంరూరల్, జూన 30: మండలంలోని మన్నీల గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి ఓ రైతు సాగు చేసిన బొప్పాయి చెట్లు నరికివేశారు. బత్తపల్లి మండలం ఎర్రాయిపల్లికి చెందిన వెంకటరాముడు మన్నీల గ్రామ పొలం సర్వే నెంబరు 47లోని 4.8 ఎకరాల్లో ఉన్న భూమిలో బొప్పాయి పంట సాగు చేశాడు. ఆరు నెలల కిందట దాదాపు రూ.ఏడు లక్షల పెట్టుపెట్టి ఐదు వేల మొక్కలు నాటాడు. పంట కూడా చేతికొచ్చే దశలో ఉంది. మరో ఇరవై రోజుల్లో పంట కోత కోయాల్సి ఉంది. అయితే శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 500 చెట్ల నరికివేశారు. దీంతో దాదాపు రూ.2లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు
వాపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ధర్మవరం నియోజకవర్గం తెలుగు రైతు అధ్యక్షుడు చల్లా శ్రీనివాసులు, పలువురు రైతులతో కలిసి పొలాన్ని పరిశీలించారు. రైతుతో కలిసి ఇటుకలపల్లి పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ రైతుల పట్ల ఇంత రాక్షసంగా వ్యవహరించిన దుండగులపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, రైతులు జయప్ప, నాయుడు, స్టోర్ నాయుడు, చల్లా నాయుడు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....