Share News

సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డెన సెర్చ్‌

ABN , Publish Date - May 26 , 2024 | 11:57 PM

కుందుర్పి పోలీస్‌ స్టేషన పరిధిలోని సమస్యాత్మక గ్రామమైన కెంచంపల్లిలో ఆదివారం కార్డెన సెర్చ్‌ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. కళ్యాణదుర్గం పట్టణ, రూరల్‌ సీఐలు, బ్రహ్మసముద్రం, కుందుర్పి ఎస్‌ఐలు కలసి గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు, పాత కేసుల్లోని నిందితుల ఇళ్లలో తనిఖీలు చేశారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డెన సెర్చ్‌
Police Searching in Kenchanapalli village

కుందుర్పి, మే 26: కుందుర్పి పోలీస్‌ స్టేషన పరిధిలోని సమస్యాత్మక గ్రామమైన కెంచంపల్లిలో ఆదివారం కార్డెన సెర్చ్‌ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. కళ్యాణదుర్గం పట్టణ, రూరల్‌ సీఐలు, బ్రహ్మసముద్రం, కుందుర్పి ఎస్‌ఐలు కలసి గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు, పాత కేసుల్లోని నిందితుల ఇళ్లలో తనిఖీలు చేశారు. గ్రామంలోని ప్రధాన రహదారులు, కాలనీల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. అనంతరం అనుమానాస్పద వ్యక్తులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ప్రజలతో సమావేశం నిర్వహించి ఎటువంటి గొడవలు, అల్లర్లు జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా మెలగాలని సూచించారు.

బెళుగుప్ప: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక మండలంలో హింసాత్మక సంఘటనలు జరుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌ఐ శివ ఆదివారం తెలిపారు. బందోబస్తు చర్యల్లో భాగంగా తగ్గుపర్తి, బెళుగుప్పలో సీఐ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది స్థానిక పోలీసులతో కలసి మార్చ్‌పాస్ట్‌ నిర్వహించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


యల్లనూరు: మండలంలోని దంతలపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం నాకాబందీ నిర్వహించినట్లు ఎస్‌ఐ గిరిబాబు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి అల్లర్లకు దిగరాదని గ్రామస్థులను హెచ్చరించారు. రౌడీషీటర్లు, ఫ్యాక్షనిస్టు అనుచరుల గృహాల్లో సోదా లు చేసినట్లు ఆయన తెలిపారు.

పుట్లూరు,: మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన శనగలగూడూరు, గరుగుచింతలపల్లి, కోమటికుంట్ల, మడుగుపల్లి, ఓబులాపురం, కడవకల్లు, ఎ. కొండాపురం గ్రామాల్లో ఆదివారం ర్యాపిడ్‌యాక్షన ఫోర్స్‌ బలగాలతో కవాతు నిర్వహించారు. సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కౌంటింగ్‌లో ఏ పార్టీ విజయం సాధించినా ఎలాంటి గొడవలు, అల్లర్లకు దిగరాదన్నారు. ప్రశాంత వాతావరణంలో ఉండాలని సూచించారు. ఎస్‌ఐ హేమాద్రి, సిబ్బంది పాల్గొన్నారు.


ఉరవకొండ: మండలంలోని చిన్నముష్టూరు, పెద్దముష్టూరు గ్రామాల్లో కేంద్ర బలగాలు కవాతు నిర్వహించాయి. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు పర్యటించారు. గ్రామసభలు నిర్వహించి ప్రజలందరూ కలిసిమెలసి ఉండాలని సూచించారు. కౌంటింగ్‌ రోజు, ఆ తర్వాత ఎలాంటి గొడవలకు దిగకూడదని ఎస్‌ఐ రాఘవేంద్రప్ప సూచించారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - May 26 , 2024 | 11:57 PM