Anam Venkata Ramanareddy: వాళ్ల నడుములు విరగ్గొట్టడం మాకూ వచ్చంటూ ఆనం ఫైర్
ABN , Publish Date - Feb 20 , 2024 | 11:37 AM
టీడీఆర్ బాండ్స్ కుంభకోణంలో మూడు నామాల బ్రోకర్ కరుణాకర్ రెడ్ది, చిన్న బ్రోకర్ అభినయ రెడ్ది ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనం రమణారెడ్డి పేర్కొన్నారు. గత తన మీడియా సమావేశం తరువాత కరుణాకర్, ఆయన కొడుకు బయటకు రాలేదన్నారు. 373 టీడీఆర్ బ్రాండ్స్‌లో సగానికి సగం అవినీతి జరిగిందన్నారు.
నెల్లూరు: టీడీఆర్ బాండ్స్ (TDR Bonds) కుంభకోణంలో మూడు నామాల బ్రోకర్ కరుణాకర్ రెడ్ది, చిన్న బ్రోకర్ అభినయ రెడ్ది ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనం వెంకట రమణారెడ్డి (Anam Venkata Ramanareddy) పేర్కొన్నారు. గత తన మీడియా సమావేశం తరువాత కరుణాకర్, ఆయన కొడుకు బయటకు రాలేదన్నారు. 373 టీడీఆర్ బ్రాండ్స్‌లో సగానికి సగం అవినీతి జరిగిందన్నారు. 18 మాస్టర్ ప్లాన్ల రోడ్లలో కాసుల వర్షం కురిసిందన్నారు. 60 ఎకరాలని, ఒక్కో ఎకరా రూ.59.81కోట్లకి తీసుకున్నారని ఆనం పేర్కొన్నారు. భూమికి సంబంధం లేని వారికి బాండ్స్ ఇచ్చారని.. జాయింట్ కలెక్టర్ స్వయాన స్పష్టం చేశారని గుర్తు చేశారు. తిరుపతిలో డబ్బులిస్తే ఏదైనా చేసేస్తారన్న అనుమానం కలుగుతోందని ఆనం అన్నారు.
ఆధారాలు చూపించినా విచారణ నిల్..
కలెక్టర్, సబ్ రిజిస్టర్, రెవెన్యూ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారని ఆనం రమణారెడ్డి పేర్కొన్నారు. రూ.10వేలు విలువ చేసే భూమికి లక్ష అరవై వేలు వేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ సొమ్ము లెక్కలేకుండా దోచేస్తున్నారన్నారు. ధర్మారెడ్డి (Dharmareddy) వియ్యంకుడు వెంకటరమణా రెడ్దికి కూడా దోచిపెట్టారన్నారు. ఆధారాలతో చూపించినా విచారణ కూడా వేయలేదని ఆనం అన్నారు. టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీఆర్ బాండ్స్‌పై కచ్చితంగా విచారణ చేపడుతామన్నారు. టీడీఆర్ బాండ్స్‌లో అవినీతికి పాల్పడిన వారే ఓట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు.
భారతిరెడ్డిపై విమర్శలు చేస్తే తట్టుకోలేరు..
మీడియాపై దాడికి పాల్పడటం హేయమైన చర్య అని ఆనం పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై 307 సెక్షన్ కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. మీడియా యాజమాన్యాల నడుములు విరగ కొడుతామని అనే వాళ్ల నడుములు విరగకొట్టడం తమకు కూడా వచ్చని ఆనం ఫైర్ అయ్యారు. సాక్షి మీడియా యజమాని భారతి రెడ్ది (Bharathi Reddy) మీద తాము విమర్శలు చేస్తే తట్టుకోలేరన్నారు. మే తరువాత కొడాలి నాని (Kodali Nani) గడ్డం తీసేసి బురఖా వేసుకొని తిరుగుతాడన్నారు. పల్నాడుకి పోయి అనిల్ మీసాలు తిప్పితే గొరిగి పంపిస్తారన్నారు. పల్నాడు ప్రజలు ఎలాగూ అనిల్‌ని ఓడగొట్టి నెల్లూరుకి పంపిస్తారని ఆనం రమణారెడ్డి పేర్కొన్నారు.