Agriculture Secretary : రైతుల్లో మానసిక ధైర్యం నింపాలి
ABN , Publish Date - Dec 31 , 2024 | 06:05 AM
విపత్తులతో వ్యవసాయం ఆటుపోట్లకు గురవువుతున్న పరిస్థితుల్లో రైతులు మనోధైర్యం కోల్పోయి, ఆత్మహత్యలకు పాల్పడకుండా, వారిలో మానసిక ధైర్యం పెంచేలా బ్యాంకర్లు భరోసా కల్పించాలని

వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ రాజశేఖర్
విపత్తులతో వ్యవసాయం ఆటుపోట్లకు గురవువుతున్న పరిస్థితుల్లో రైతులు మనోధైర్యం కోల్పోయి, ఆత్మహత్యలకు పాల్పడకుండా, వారిలో మానసిక ధైర్యం పెంచేలా బ్యాంకర్లు భరోసా కల్పించాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ సూచించారు. సోమవారం జిల్లాల లీడ్ బ్యాంక్ మేనేజర్లు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల అధిపతులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్న విషయంపై రైతులకు అవగాహన కల్పించేలా క్షేత్రస్థాయి వ్యవసాయ సిబ్బంది కృషి చేయాలన్నారు. వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఎలాంటి పూచీకత్తూ లేకుండా పంట రుణాలను రూ.లక్షా60వేల నుంచి రూ.2లక్షలకు పెంచిన దానిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులకు పూర్తిగా మానవీయ కోణంలో సహకా రం అందిస్తామని బ్యాంకర్ల రాష్ట్ర కన్వీనర్ భాస్కరరావు భరోసా ఇచ్చారు.