Janasena: జనసేనలో చేరిన ప్రముఖ నటుడు పృథ్వీరాజ్.. పోటీ ఎక్కడ నుంచో?
ABN , Publish Date - Jan 24 , 2024 | 06:44 PM
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లోకి చేరికలు, వలసలు కొనసాగుతున్నాయి. అధికార వైసీపీ అసంతృప్త నేతలు టీడీపీ, జనసేన వైపు చూస్తున్నాయి. కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నవారు తమకు నచ్చిన పార్టీల్లో చేరుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు, గతంలో వైసీపీకి రాజీనామా చేసిన పృథ్వీరాజ్ జనసేనలో చేరారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల్లోకి చేరికలు, వలసలు కొనసాగుతున్నాయి. అధికార వైసీపీ అసంతృప్త నేతలు టీడీపీ, జనసేన వైపు చూస్తున్నాయి. కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నవారు తమకు నచ్చిన పార్టీల్లో చేరుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు, గతంలో వైసీపీకి రాజీనామా చేసిన పృథ్వీరాజ్ జనసేనలో చేరారు. బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. పవన్ కల్యణ్ పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు.

కాగా పృథ్వీరాజ్ గతంలో వైఎస్సార్‌సీపీలో పనిచేశారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత టీటీడీకి చెందిన ఎస్‌వీబీసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఓ వివాదం కారణంగా ఆయనపై వైసీపీ వేటు వేసిన విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన వైసీపీ సీటు దక్కలేదు. మరి ఈసారి జనసేనలో చేరడంతో ఎక్కడి నుంచి పోటీకి దిగబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
