Agniveers: గోల్కొండలో 3300 మంది అగ్ని వీరులకు ప్రత్యేక శిక్షణ

ABN, First Publish Date - 2023-01-10T19:54:53+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ప్రారంభమైంది. అర్హులైన యువకులను ఎంపికచేసిన సైనిక అధికారులు తీర్చిదిద్దుతున్నారు.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ప్రారంభమైంది. అర్హులైన యువకులను ఎంపికచేసిన సైనిక అధికారులు తీర్చిదిద్దుతున్నారు. కఠిన శిక్షణ పూర్తి చేసుకున్న అగ్నివీరులు (Agniveers) సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించనున్నారు. గోల్కొండ ఆల్టిలరీ సెంటర్‌లో అగ్నిపథ్ పథకం (Agnipath Scheme)లో భాగంగా ఎంపికైన అగ్నివీరుల మొదటి బ్యాచ్‌కు శిక్షణ ప్రారంభమైంది. మొదటి బ్యాచ్‌లో 3300 మందికి శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ చాలా కఠినంగా ఉంటుంది. దేశంలో ఆర్మీ శిక్షణా కేంద్రాల్లో గోల్కొండ (golconda) ఆర్టిలరీ సెంటర్ ఒకటి. జనవరి 1వ తేదీ నుంచి శిక్షణ మొదలైంది. మార్చి నెలలో మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి అవుతుంది. ఈ శిక్షణలో ఫిజికల్ ఫిట్‌నెస్‌తో పాటు ఆయుధాల శిక్షణ కూడా ఇస్తున్నారు. అగ్నివీరులకు ఎలా శిక్షణ ఇస్తారు.. శిక్షణ తీసుకునే వీరుల దినచర్య ఎలా మొదలవుతుంది.. అనే అనుమానాలు చాలామందికి ఉన్నాయి. అయితే మీరు కూడా అగ్నివీరులు శిక్షణను ఈ వీడియోలో తిలకించండి.

Updated at - 2023-01-10T19:54:55+05:30