YS Sharmila: ఆ నీళ్లు ఏమన్నా కేసీఆర్ సొంత ఆస్తా?

ABN , First Publish Date - 2023-02-06T11:47:53+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

YS Sharmila: ఆ నీళ్లు ఏమన్నా కేసీఆర్ సొంత ఆస్తా?

హనుమకొండ: ముఖ్యమంత్రి కేసీఆర్‌(Telangana CM KCR)పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరామ్ సాగర్ (Sriram Sagar Water) నీళ్ళు కేసీఆర్ సొంత ఆస్తి అయినట్లు ఫీల్ అవుతున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర (Maharashtra) వాళ్లకు అప్పనంగా అర్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ‘‘కేసీఆర్ తెలంగాణ (Telangana State) అనే నామాన్ని ఇప్పటికే తీసేశారు. మీ రాజకీయాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌ను దారాదత్తం ఎలా చేస్తారు. శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణ ఆస్థి. తెలంగాణ ప్రజల (Telangana People) కు కేసీఆర్ సమాధానం చెప్పాలి’’ అంటూ డిమాండ్ చేశారు. జై తెలంగాణ అనే దమ్ము కేసీఆర్‌కు లేదన్నారు. కేసీఆర్‌కు మహారాష్ట్ర రైతేలే రైతులా?.. ఇక్కడ రైతుల మరణాలకు కేసీఆర్ బాధ్యుడు కాదా..? అంటూ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.

కేసీఆర్ ఏమన్నారంటే...

మహారాష్ట్ర (Maharashtra)కు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) బంపరాఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. నిన్న మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్ (BRS) బహిరంగ సభ అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం... మహారాష్ట్ర సహకారంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) పూర్తి అయినట్లు చెప్పారు. అవసరమైతే శ్రీరాంసాగర్ (SriramSagar) నీళ్లను మహారాష్ట్ర లిఫ్ట్ చేసుకోవచ్చని తెలిపారు. ఏటా వేల టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రం పాలు అవడానికి రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాలే కారణమన్నారు. తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh), మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వాలు కూర్చుని మాట్లాడితే గోదావరి జలాల (Godavati water)ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-02-06T11:50:29+05:30 IST