Hanmakonda: ప్రమాదవశాత్తు గోడకూలి ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2023-09-22T16:19:20+05:30 IST

జిల్లాలోని శాయంపేట మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది.

Hanmakonda: ప్రమాదవశాత్తు గోడకూలి ముగ్గురు మృతి

హనుమకొండ: జిల్లాలోని శాయంపేట మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గోడకూలి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక వృద్ధుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇద్దరు ఘటనాస్థలిలోనే మృతి చెందగా.. పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. మృతులు శాయంపేట మండల కేంద్రానికి చెందిన మోర పెద్ద సాంబయ్య, లోకపోయిన సారమ్మ, భోగి జోగమ్మగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-09-22T16:19:20+05:30 IST