Navya: సొంత పార్టీ మహిళా సర్పంచ్‌కే రక్షణ లేకుంటే...
ABN , First Publish Date - 2023-06-26T15:15:16+05:30 IST
వరంగల్ జిల్లా: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజయ్యపై నవ్య సంచలన ఆరోపణలు చేశారు.
వరంగల్ జిల్లా: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య (MLA Rajaiah), జానకిపురం సర్పంచ్ నవ్య (Sarpanch Navya) ఎపిసోడ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజయ్యపై నవ్య సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే రాజయ్యతో ప్రాణహాని ఉందని, ఆధారాలు ఇచ్చినా పోలీసులు కేసు నమోదు చేయడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరులు తనకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారని, ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి కేటీఆర్ (Minister KTR) ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సొంత పార్టీ మహిళా సర్పంచ్‌కే రక్షణ లేకుంటే ఇక రాష్ట్రంలోని మహిళలకు ఎం న్యాయం చేస్తారని ఆమె నిలదీశారు. ఈ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి కడియం శ్రీహరి (Kadiyam Srihari) కూడా కనీసం స్పందించడంలేదని, ఆయనకూ ముగ్గురు కూతుళ్లు ఉన్నారు...నేను ఆయన కూతురు లాంటిదాన్నే కదా..ఈ అంశంపై ఆయన ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. త్వరలో మహిళా కమిషన్ (Women Commission)ను ఆశ్రయిస్తానని సర్పంచ్ నవ్య స్పష్టం చేశారు. కాగా ఎమ్మెల్యే రాజయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య మరోసారి ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు.