Share News

TS News: అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ABN , First Publish Date - 2023-12-12T11:14:13+05:30 IST

Telangana: జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం దామెర మండలం పసరగొండ దగ్గర ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.

TS News: అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

హనుమకొండ: జిల్లాలో ఆర్టీసీ బస్సుకు (TSRTC Bus) పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం దామెర మండలం పసరగొండ దగ్గర ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో పదిమంది ప్రయాణికులకు గాయాలవగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు హనుమకొండ నుంచి ఏటూరునాగారం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కెపాసిటీకి మించి ప్రయాణికులు ఎక్కడంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-12-12T13:30:52+05:30 IST