Warangal: కుక్కలే కాదు.. కోతులతోనూ జాగ్రత్త సుమా.. రెండు నెలల చిన్నారిని ఏం చేశాయో చూడండి..

ABN , First Publish Date - 2023-02-23T11:24:55+05:30 IST

రాష్ట్రంలో కుక్కలు, కోతుల బెడద ఎక్కువగా ఉంది.

Warangal: కుక్కలే కాదు.. కోతులతోనూ జాగ్రత్త సుమా.. రెండు నెలల చిన్నారిని ఏం చేశాయో చూడండి..

మహబూబాబాద్: రాష్ట్రంలో కుక్కలు, కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఇటీవలే హైదరాబాద్‌ (Hyderabad) లో కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి (Five Years Old Boy) ప్రాణాలు కోల్పోగా... ఎక్కువ సంఖ్యలో చిన్నారులు కుక్కకాటుకు గురయ్యారు. అయితే కోతులు (Monkeys) కూడా చిన్నారులను వదలడం లేదు. కోతి దాడిలో రెండు నెలల చిన్నారి (Baby Boy)గాయపడ్డాడు.

మహబూబాబాద్‌ (Mahabubabad)లో చోటు చేసుకుంది. జిల్లాలోని కురవి మండలం మోదగుల గూడెం గ్రామంలో రెండు నెలల చిన్నారిపై కోతి దాడి చేసింది. చిన్నారి బొటన వేలును కోతి కొరికేసింది. వెంటనే తల్లిదండ్రులు చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. గ్రామంలో కోతులు ఎక్కువగా ఉన్నాయని... అధికారులు వెంటనే స్పందించి కోతులను బంధించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.

కోతి అంటేనే అల్లరికి మారుపేరు. ఆహారం కోసం నానా ఫీట్లు చేస్తుంటాయి. మనుషుల చేతుల్లో ఉన్న పదార్థాల కోసం ఎగబడుతుంటాయి. ఇలా కోతి చేష్టలు ఓ వైపు నవ్వు తెప్పిస్తే.. మరోవైపు అవి ఏం చేస్తాయో అని భయపడుతుంటాం. కొన్ని చోట్ల గుంపులుగా తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాలో కోతులు ఎక్కువగా సంచరిస్తున్నాయి. కోతులు చేసే హంగామాతో ప్రజలు విసిగెత్తిపోయారు. మనుషులు కనబడితే చాలు కోతులు దాడులకు పాల్పడుతున్నాయి.

Updated Date - 2023-02-24T23:35:33+05:30 IST