BRS : జనగామ బీఆర్ఎస్‌లో ముదిరిన వార్.. పల్లాకు వ్యతిరేకంగా ముత్తిరెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన

ABN , First Publish Date - 2023-09-02T12:51:37+05:30 IST

జనగామ బీఆర్ఎస్‌లో వార్ ముదిరింది. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తాడోపేడో తేల్చుకునేందుకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సిద్ధమయ్యారు. తన వర్గీయులపై కేసులు పెట్టించడాన్ని నిరసిస్తూ ముత్తిరెడ్డి వర్గం ఆందోళనకు దిగింది.

BRS : జనగామ బీఆర్ఎస్‌లో ముదిరిన వార్.. పల్లాకు వ్యతిరేకంగా ముత్తిరెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన

జనగామ : జనగామ బీఆర్ఎస్‌లో వార్ ముదిరింది. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తాడోపేడో తేల్చుకునేందుకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సిద్ధమయ్యారు. తన వర్గీయులపై కేసులు పెట్టించడాన్ని నిరసిస్తూ ముత్తిరెడ్డి వర్గం ఆందోళనకు దిగింది. పల్లాకు వ్యతిరేకంగా జనగామ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారికి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంఘీభావం తెలిపారు. దళిత ద్రోహి పల్లా రాజేశ్వర్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన చేశారు. రోడ్డుపై తన షర్టు విప్పి నిరసన తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి దళితులపై కేసులు పెట్టించడానికి నిరసిస్తూ ముత్తిరెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు.

Updated Date - 2023-09-02T12:51:37+05:30 IST