Viveka Murder Case : కీలక దశలో వివేకా హత్యకేసు విచారణ.. సీబీఐ డైరెక్టర్‌కు ఎంపీ అవినాష్ లేఖ.. అందులో ఏముందంటే..

ABN , First Publish Date - 2023-07-23T19:11:44+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో సీబీఐ దర్యాప్తుపై సందేహాలు వ్యక్తం చేస్తూ ప్రస్తుత డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు.

Viveka Murder Case : కీలక దశలో వివేకా హత్యకేసు విచారణ.. సీబీఐ డైరెక్టర్‌కు ఎంపీ అవినాష్ లేఖ.. అందులో ఏముందంటే..

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో సీబీఐ దర్యాప్తుపై సందేహాలు వ్యక్తం చేస్తూ ప్రస్తుత డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. గతంలో ఎస్పీ రామ్‌సింగ్ విచారించిన ఈ కేసు తీరును పునః సమీక్షించాలని కోరారు.


"వివేకా కేసును గతంలో విచారించిన సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై ఫిర్యాదు. పక్షపాత వైఖరితో రాంసింగ్ దర్యాప్తు చేశారని ఆరోపణ. రామ్‌సింగ్ చేసిన దర్యాప్తు తీరును సమీక్షించాలి. సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జ్‌షీట్ ఆధారంగా అవినాష్ లేఖ. వివేకా రెండో వివాహం, బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ అంశాలు లేఖలో ప్రస్తావన. దస్తగిరి నిలకడలేని సమాధానాల ఆధారంగా రాంసింగ్ విచారణ జరిపారు. రెండో భార్య పేరుతో ఉన్న ఆస్తి పత్రాలను ఎత్తుకెళ్లడానికే హత్య చేసి ఉండొచ్చు. నాన్న కోణంలో విచారణ జరగలేదు. మున్నా లాకర్లో నగదుకు సంబంధించిన వివరాలు సీబీఐకి ఎవరూ చెప్పారు. విచారణలో రాంసింగ్ చేసిన తప్పులను సవరించాలి. నిజమైన నేరస్తులను పట్టుకుని న్యాయం చేయాలి." అని అవినాష్ రెడ్డి అన్నారు.


"సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌సీట్లపై అవినాష్ రెడ్డి అభ్యంతరం. సీబీఐ దర్యాప్తు సరిగ్గా జరగలేదు. గత దర్యాప్తు అధికారి ఏకపక్షంగా దర్యాప్తు చేశారు. కేవలం ఇద్దరూ స్టేట్‌మెంట్ల ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేశారు. దర్యాప్తులో చాలా అంశాలను వదిలిపెట్టారు. ఈ కేసులో అప్రూవల్‌గా మారిన దస్తగిరి స్టేట్‌మెంట్‌ను ఆధారంగా చేసుకుని సీబీఐ అధికారులు సాక్ష్యంగా తీసుకున్నారు. ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిపై మరోసారి పునః పరిశీలన చేయాలి." అని అవినాష్ రెడ్డి సీబీఐ డైరెక్టర్‌ను కోరారు.

Updated Date - 2023-07-23T19:34:28+05:30 IST