Share News

Vijayashanthi: బీజేపీకి విజయశాంతి రాజీనామా?

ABN , First Publish Date - 2023-11-15T22:45:22+05:30 IST

బీజేపీకి విజయశాంతి రాజీనామా చేశారు. రాజగోపాల్‌రెడ్డి, వివేక్ బాటలో కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Vijayashanthi: బీజేపీకి విజయశాంతి రాజీనామా?

హైదరాబాద్: బీజేపీకి విజయశాంతి రాజీనామా చేశారు. రాజగోపాల్‌రెడ్డి, వివేక్ బాటలో కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల తిరిగి రావాలంటూ కాంగ్రెస్‌ నేతలు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. పార్టీలోనే ఉండాలని విజయశాంతిని బీజేపీ నేతలు ఒప్పించే ప్రయత్నం చేశారు. ఎంత చెప్పినా విజయశాంతి ససేమిరా అంటున్నారు. తన రాజీనామా లేఖను జేపీ నడ్డాకు పంపినట్లు విజయశాంతి తెలిపారు.

Updated Date - 2023-11-15T22:46:27+05:30 IST