Vijayashanthi: సొంత పార్టీ నేతలపై విజయశాంతి ఫైర్
ABN , First Publish Date - 2023-09-21T18:14:10+05:30 IST
సొంత పార్టీ నేతలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి (Vijayashanthi) ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: సొంత పార్టీ నేతలపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి (Vijayashanthi) ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి (BJP) రాములమ్మ దూరమన్న ప్రచారాన్ని విజయశాంతి ఖండించారు.
"చిట్‌చాట్‌ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ తనకు లేదని, పరోక్షంగా ఈటలకు రాజేందర్‌కు కౌంటర్ ఇచ్చారు. పార్టీకి ఏది ముఖ్యమో ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు ఈ నెల 16న ముఖ్యనేతల సమావేశంలో నేను స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఆ విషయాలు బయటకు లీకేజ్‌ల పేరుతో ఇవ్వడానికి నేను వ్యతిరేకిని. కొంతమంది మా పార్టీలోని నేతలు పనిగట్టుకుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి రాములమ్మ దూరమంటూ నాపై సోషల్ మీడియా ద్వారా చేయిస్తున్న ప్రచారం ఖండిస్తున్నా." అని విజయశాంతి అన్నారు.