Vemulawada: సిరులు కురిపిస్తున్న కురులు

ABN , First Publish Date - 2023-04-21T19:06:50+05:30 IST

పేదల దేవుడు వేములవాడ (Vemulawada) రాజన్నకు కురుల ద్వారా సిరులు కురుస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla district)లోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి

Vemulawada: సిరులు కురిపిస్తున్న కురులు

వేములవాడ: వేములవాడ (Vemulawada) రాజన్నకు కురుల ద్వారా సిరులు కురుస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla district)లోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం ఆదాయంలో పది శాతం వరకు కేవలం తలనీలాల హక్కుల లీజు ద్వారానే వస్తోంది. వచ్చే రెండేళ్ల కాలంలో రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం కల్యాణకట్టలో భక్తులు (Devotees) సమర్పించే తలనీలాలను పోగుచేసుకునే హక్కు కోసం ఈ నెల 4వ తేదీన నిర్వహించిన బహిరంగ వేలం కమ్‌ టెండరులో అనంతపురం జిల్లా (Anantapur District) హిందూపురానికి చెందిన సుమిత్‌ ఎంటర్‌ప్రైజెస్‌ యజమాని నాగరాజు అత్యధికంగా 19 కోట్ల 8 వేల రూపాయలకు టెండరు దాఖలు చేసి 2023-2025 సంవత్సరాల హక్కులను దక్కించుకున్నారు.

తొలిసారి నిర్వహించిన టెండరులో రెండేళ్ల కాలానికి కేవలం 8 కోట్ల 67 లక్షల బిడ్‌ మాత్రమే దాఖలు కావడంతో ఆలయ అధికారులు మరోసారి టెండరు నిర్వహించారు. ఫలితంగా అనూహ్య రీతిలో టెండరు లీజు కోసం 19 కోట్ల 8 వేల రూపాయలు పలికింది. 2014-2016 సంవత్సరంలో రూ. 12 కోట్ల 20 లక్షల 10 వేలు పలికిన తలనీలాల టెండరు, 2016-18 సంవత్సరంలో రూ. 13 కోట్ల 14 లక్షలకు చేరింది. 2018-20 సంవత్సరంలో రూ. 13 కోట్ల 64 లక్షల 51, 116 పలకగా, 20-21 సంవత్సరంలో కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా కల్యాణకట్ట మూసి ఉంచారు. 2021 జనవరి నుంచి 2023 ఏప్రిల్‌ 11 వరకు రూ. 9 కోట్ల ఒక లక్ష పలికిన టెండరు ఈసారి ఎవరూ ఊహించని విధంగా 19 కోట్ల మార్కు దాటడం విశేషం. మొత్తం మీద తలనీలాల టెండరు హక్కులు వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి ఖజానాకు సిరులు కురిపిస్తున్నాయని చెప్పవచ్చు.

Updated Date - 2023-04-21T19:18:58+05:30 IST