KTR: కేటీఆర్ పర్యటన.. టెన్షన్.. టెన్షన్

ABN , First Publish Date - 2023-01-30T17:49:19+05:30 IST

జిల్లాలోని రేపు కమలాపురం (Kamalapuram)లో మంత్రి కేటీఆర్ (KTR) పర్యటించనున్నారు.

KTR: కేటీఆర్ పర్యటన.. టెన్షన్.. టెన్షన్

హనుమకొండ: జిల్లాలోని రేపు కమలాపురం (Kamalapuram)లో మంత్రి కేటీఆర్ (KTR) పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆ ప్రదేశంలో టెన్షన్ టెన్షన్ వాతావారణ పరిస్థితి నెలకొంది. దాంతో పోలీసుల బలగాలు భారీగా మోహరించారు. కేటీఆర్ పర్యటన దృష్టిలో ఉంచుకుని కమాలపురంలో సీపీ రంగనాథ్ (CP Ranganath) పర్యటించిన పర్యటన ప్రదేశాన్ని పరిశీలించారు. పర్యటన ఏర్పాట్లు, భద్రతను సీపీ రంగనాథ్ పర్యవేక్షించారు. విపక్ష నాయకులను పోలీసు (TS Polise)లు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ముందస్తు అరెస్టులపై బీజేపీ నాయకులు (BJP Leaders) భగ్గుమంటున్నారు. ప్రభుత్వం తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఇవాళ మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌లో రూ.450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... నీళ్లిస్తే అద్భుతాలు చేస్తామని మన రైతులు నిరూపించారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. స్వల్ప సమయంలో తెలంగాణ ప్రగతి సాధించిందని వెల్లడించారు. నీటి వనరుల్లో విప్లవం సాధించామని చెప్పారు. అనతి కాలంలోనే మిగులు విద్యుత్‌ సాధించామన్నారు. రైతులకు 24 గంటల కరెంటు అందిస్తున్నామని చెప్పారు. ఐటీసీ అతిపెద్ద పేపర్‌ మిల్లు తెలంగాణలోనే ఉందన్నారు. తెలంగాణపై ఐటీసీ చైర్మన్‌ సంజీవ్‌పురి ప్రశంసలు సంతోషం కలిగించాయని చెప్పారు. ఈ ప్లాంటులో గోధుమ పిండి, చిప్స్‌, బిస్కెట్లు, నూడుల్స్‌ తయారు చేస్తున్నారని వెల్లడించారు. నీటి వనరుల్లో విప్లవం సాధించామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని నాలుగేండ్లలోనే పూర్తి చేశామన్నారు. 10 టీఎంసీల కాళేశ్వరం నీటిని పరిశ్రమలకు అందిస్తున్నామని చెప్పారు. దేశంలో ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. మిషన్‌ కాకతీయతో 46 వేల చెరువులను బాగుచేశామని, దీంతో వ్యవసాయ స్థిరీకరణ, సాగుపెంపు సాధ్యమైందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులతో సాగువిస్తీర్ణం రెట్టింపయిందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గొర్రెలు, మేకల సంఖ్య రెట్టింపయిందన్నారు.

Updated Date - 2023-01-30T17:49:21+05:30 IST