Indrakaran Reddy: ‘రేపో మాపో ఆయన పార్టీ మారడం ఖాయం’

ABN , First Publish Date - 2023-03-28T19:31:04+05:30 IST

కాంగ్రెస్ నేత మ‌హేశ్వ‌ర్ రెడ్డి (Maheswar Reddy) పై మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Indrakaran Reddy: ‘రేపో మాపో ఆయన పార్టీ మారడం ఖాయం’

నిర్మల్: కాంగ్రెస్ నేత మ‌హేశ్వ‌ర్ రెడ్డి (Maheswar Reddy) పై మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఉద్యోగాల నియామాకాల్లో తనపై మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలను ఇంద్రకరణ్ రెడ్డి ఖండించారు. తప్పుడు ఆరోప‌ణ‌లు కాదు.... ఆధారాలుంటే బ‌య‌ట‌పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. నిరూపిస్తే చ‌ట్టం ప్ర‌కారం ఏ శిక్ష‌కైనా సిద్ధమని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో మ‌హేశ్వ‌ర్ రెడ్డి ప‌నైపోయిందని ఎద్దేవా చేశారు. రేపో మాపో మహేశ్వర్ రెడ్డి పార్టీ మారడం ఖాయమని మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి జోస్యం చెప్పారు.

Updated Date - 2023-03-28T19:31:04+05:30 IST