Share News

Talasani: మంత్రి తలసాని సంచలన కామెంట్స్.. కాంగ్రెస్‏వి గ్యారెంటీలేని వారంటీలు

ABN , First Publish Date - 2023-11-21T09:12:43+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీవి గ్యారెంటీలేని వారంటీలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌(Minister Thalasani Srinivasaayadav)

Talasani: మంత్రి తలసాని సంచలన కామెంట్స్.. కాంగ్రెస్‏వి గ్యారెంటీలేని వారంటీలు

అడ్డగుట్ట(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీవి గ్యారెంటీలేని వారంటీలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌(Minister Thalasani Srinivasaayadav) ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ చెప్పిన గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, కర్ణాటకలో ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయలేక అక్కడి ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. 25వ తేదీన సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించే సీఎం కేసీఆర్‌ బహిరంగసభ ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభ కోసం వాహనాల్లో వచ్చేవారికి 24 ప్రాంతాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నగరం నుంచి వేలాది మంది హాజరవుతారని చెప్పారు. హ్యాట్రిక్‌ సీఎంగా కేసీఆర్‌ పరేడ్‌గ్రౌండ్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. ఢిల్లీ నుంచి కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు తెలంగాణపై గద్దల్లా వాలుతున్నారని, తప్పుడు ప్రచారం చేస్తూ అమలుకు సాధ్యం కాని హామీలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌, దయానంద్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కంటోన్మెంట్‌ అభ్యర్థి లాస్యనందిత, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గజ్జెల నగేష్‌, నాయకులు ఎమ్మెన్‌ శ్రీనివాస్‌, మహేశ్వర్‌రెడ్డి, గుర్రం పవన్‌కుమార్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-21T09:12:44+05:30 IST