Supreme Court Collegium: తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బదిలీ

ABN , First Publish Date - 2023-07-05T20:48:35+05:30 IST

ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ (Justice Ujjal Bhuyan), జస్టిస్ ఎస్వీ భట్టిలను (Justice SV Bhatti) సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం (Supreme Court Collegium) సిఫార్సు చేసింది.

Supreme Court Collegium: తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బదిలీ

న్యూఢిల్లీ: ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ (Justice Ujjal Bhuyan), జస్టిస్ ఎస్వీ భట్టిలను (Justice SV Bhatti) సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం (Supreme Court Collegium) సిఫార్సు చేసింది.

co.jpg

కొలీజియం సిఫార్సుతో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బదిలీ అయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ను నియమించారు. 2022 జూన్ 28 నుంచి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భూయాన్ పని చేశారు. కొలీజియం సిఫార్సుతో తెలంగాణ హై కోర్టు చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్టుకు బదిలీ అయ్యారు. మరో చీఫ్ జస్టిస్ కూడా బదిలీ అయ్యారు. కేరళ హైకోర్టు నుంచి జస్టిస్ ఎస్వీ భట్‌ను సుప్రీం కోర్టు జడ్జిగా నియమించారు.

ప్రస్తుతం జస్టిస్ భూయాన్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తుండగా, జస్టిస్ భట్టి కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.

Updated Date - 2023-07-05T20:49:07+05:30 IST