Congress: కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి !

ABN , First Publish Date - 2023-08-23T14:40:28+05:30 IST

అధికార బీఆర్ఎస్ (BRS) రెండు రోజులక్రితం అభ్యర్థులను ప్రకటించడంతో గెలుపు గుర్రాల అన్వేషణలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి (Congress party) పాలమూరులో మరింత పట్టుదొరికినట్టయ్యింది. ఇటివలే మరణించిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి సతీమణి, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి (Sitadayakar reddy) కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది.

Congress: కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి !

హైదరాబాద్: అధికార బీఆర్ఎస్ (BRS) రెండు రోజులక్రితం అభ్యర్థులను ప్రకటించడంతో గెలుపు గుర్రాల అన్వేషణలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి (Congress party) పాలమూరులో మరింత పట్టుదొరికినట్టయ్యింది. ఇటివలే మరణించిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి సతీమణి, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి (Sitadayakar reddy) కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఆమె కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.


ఆమె కాంగ్రెస్‌లో చేరితే పార్టీ బలోపేతం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయి. దయాకర్ రెడ్డి, ఆయన సతీమణి సీతా దయాకర్ రెడ్డి సుదీర్ఘకాలంపాటు టీడీపీలో ఉన్నాయి. సీతా దయాకర్ రెడ్డి కూడా భర్తకు తోడుగా రాజకీయాల్లో కొనసాగారు. ఆమె 2002లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆ తర్వాత 2009లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన తరువాత కూడా ఇద్దరూ టీడీపీలో కొంతకాలం కొనసాగారు. అయితే గతేడాది టీడీపీకి ఇద్దరూ రాజీనామా చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఏ పార్టీలోనూ చేరకుండా ఉన్నారు. అనంతరం అనారోగ్యంతో కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూసిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-08-23T14:48:26+05:30 IST