Sids Farm: పెరిగిన ఇన్‌పుట్ వ్యయం.. పాల ధరను రూ. 2 పెంచిన సిద్స్ ఫామ్
ABN , First Publish Date - 2023-02-04T21:31:08+05:30 IST
ఇన్‌పుట్ వ్యయం పెరగడంతో పాల ధరను రెండు రూపాయలు పెంచినట్టు
హైదరాబాద్: ఇన్‌పుట్ వ్యయం పెరగడంతో పాల ధరను రెండు రూపాయలు పెంచినట్టు సిద్స్ ఫామ్(Sids Farm) తెలిపింది. తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఎ2 గేదెపాలు, స్కిమ్ మిల్క్, ఎ2 డబుల్ టోన్డ్ గేదె పాల ధరను ప్యాకెట్‌కు రూ. 2 పెంచుతున్నట్టు పేర్కొంది. ధర పెంపు నేపథ్యంలో ఇప్పుడు అర లీటర్ ఎ2 గేదెపాల ప్యాకెట్ ధర రూ. 52కు, స్కిమ్ పాల ధర రూ. 32కు పెరిగింది. ఎ2 డబుల్ డోన్డ్ గేదెపాల ధర రూ. 42 అయింది. అయితే, ఎ2 దేశీ ఆవుపాల ధర మాత్రం రూ. 75లో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలిపింది.
పాల ధర పెంపుపై సిద్స్ ఫామ్ వ్యవస్థాపకుడు డాక్టర్ కిశోర్ ఇందుకూరి(Kishore Indukuri) మాట్లాడుతూ.. అత్యున్నత నాణ్యత కలిగిన పాల ఉత్పత్తులను అందిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఇన్‌పుట్ వ్యయం పెరగడంతో తప్పని పరిస్థితిలో పాల ధరను పెంచాల్సి వచ్చిందన్నారు. పెరిగిన ధర వినియోగదారులకు భారమే అయినప్పటికీ పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు తప్పడం లేదని కిశోర్ పేర్కొన్నారు.