Hyderabad : సాంబార్‌లో పాము ప్రత్యక్షం.. నలుగురికి తీవ్ర అస్వస్థత.. ఇదెక్కడ జరిగిందో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-07-21T23:21:26+05:30 IST

అన్నంలో పురుగులొచ్చాయ్ అని.. కూరలో బల్లి పడిందని.. కూల్‌ డ్రింక్స్‌లో తేలు వచ్చిందని.. ఇలా రకరకాల వార్తలు మనం చూస్తూనే ఉన్నాం.!. అయినప్పటికీ కొందరు మాత్రం ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగానే ప్రవర్తిస్తున్నారు. ఇందుకు ఉదాహరణే హైదరాబాద్‌లోని..

Hyderabad : సాంబార్‌లో పాము ప్రత్యక్షం.. నలుగురికి తీవ్ర అస్వస్థత.. ఇదెక్కడ జరిగిందో తెలిస్తే..!

అన్నంలో పురుగులొచ్చాయ్ అని.. కూరలో బల్లి పడిందని.. కూల్‌ డ్రింక్స్‌లో తేలు వచ్చిందని.. ఇలా రకరకాల వార్తలు మనం చూస్తూనే ఉన్నాం.!. అయినప్పటికీ కొందరు మాత్రం ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగానే ప్రవర్తిస్తున్నారు. ఇందుకు ఉదాహరణే హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో (Hyderabad ECIL) జరిగిన ఘటన. ECIL కంపెనీకి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక్కడ వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. అయితే కంపెనీ క్యాంటిన్ మాత్రం దరిద్రంగా ఉంటుందని ఇవాళ జరిగిన ఘటనతో తేలిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం ఉద్యోగులంతా కలిసి క్యాంటిన్‌లో భోజనం చేస్తుండగా.. సాంబార్‌లో పాము (Snake) ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా ఉద్యోగులు కంగుతిన్నారు. ఈ సాంబార్ తిన్న ఉద్యోగులు పలువురు అనారోగ్యానికి గురయ్యారు. నలుగురు ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో హుటాహుటిన ఈసీఐఎల్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా.. ఆ నలుగురు ఉద్యోగులు ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్నారని వైద్యులు చెబుతున్నారు.


పదే పదే ఎందుకిలా..?

ఈ విషయం తెలియక అప్పటికే తిన్నవారు భయాందోళనకు గురయ్యారు. ఘటన తర్వాత తోటి ఉద్యోగస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అసలు క్యాంటీన్ లోకి పాము ఎలా వచ్చింది..? అనేదానిపై అందరూ చాలా రకాలుగా ఆలోచిస్తేన్నారు. క్యాంటిన్ సిబ్బంది నిర్లక్షంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈసీఐఎల్ లాంటి పెద్ద సంస్థలో క్యాంటీన్ ఇంత దరిద్రంగా ఉంటుందా..? అని సోషల్ మీడియాలో జనాలు తిట్టిపోస్తున్నారు. అయితే ఈ విషయం బయటికి పొక్కకుండా ఉండేందుకు ఉన్నతాధికారులు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. శుక్రవారం రాత్రికి ఈ ఘటన మీడియాకు తెలియడంతో అధికారులు షాక్ తిన్నారు.

ECIL.jpg

కాగా.. గతంలో కూడా ఈ క్యాంటిన్‌ వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే క్యాంటిన్‌లో గతంలోఎలుకలు, తేలు, బీడీలు, సిగరెట్టు, జిల్ల పురుగులు ఆహార పదార్థాలలో వచ్చినట్లు కూడా ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. క్యాంటిన్ సిబ్బందిని వెంటనే మార్చాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. కంపెనీ అధికారులతో పాటు క్యాంటిన్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫుడ్‌ సేఫ్టీ అధికారులను ఉద్యోగులు కోరుతున్నారు. పదే పదే ఈసీఐఎల్‌లో చోటుచేసుకుంటున్న ఈ ఘటనలపై అధికారులు ఎలా ముందుకెళ్తారో వేచి చూడాల్సిందే.

Updated Date - 2023-07-21T23:23:57+05:30 IST