Sharmila: పాదయాత్రలో షర్మిల అరెస్ట్.. హైదరాబాద్‌కు తరలింపు

ABN , First Publish Date - 2023-02-19T08:44:05+05:30 IST

: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (Sharmila)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Sharmila: పాదయాత్రలో షర్మిల అరెస్ట్.. హైదరాబాద్‌కు తరలింపు

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ సమీపంలో బేతోలులో దగ్గర వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి (Sharmila)ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన కారవాన్ లోకి వెళ్లి షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిలను పోలీస్ వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. షర్మిలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. షర్మిల పాదయాత్రకు అనుమతి రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు షర్మిలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

పాదయాత్రను మహబూబాబాద్ బేతోలులో బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైఎస్‌ఆర్‌టీపీ ఫ్లెక్సీలు, కటౌట్లను బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు ధ్వంసం చేశారు. బేతోలులోని షర్మిల బస శిబిరం దగ్గర బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇప్పటికే షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

కనుసైగ చేస్తే చాలు తమ పార్టీ కార్యకర్తలు తరిమి కొడతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ వేశారు. శంకర్ నాయక్ సైగ చెయ్యి.. ఎవడోస్తాడో చూస్తా అంటూ సవాల్ విసిరారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు ఈ వైఎస్సార్ బిడ్డ అని ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లా నెళ్ళికుదురు మండల కేంద్రంలో మాట్లాడిన షర్మిల.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై మాటలతో ఎదురు దాడి చేశారు.

‘శంకర్ నాయక్ బెదిరించే దోరణిలో మాట్లాడుతున్నాడు. పాదయాత్రను అడ్డుకునేలా కార్యకర్తలను ఉసి గొల్పుతున్నారు. ప్రజల పక్షాన నిలబడి, కొట్లాడుతున్నందుకు భయపడాలా..?. మీరు చేసిన మోసాలు ఎత్తి చూపిస్తున్నందుకు భయపడాలా..?. మీ నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలు ఆడుతున్నారని, శంకర్ నాయక్ ఒక కబ్జా కోర్ అని, జనాల దగ్గర భూములు గుంజుకోడమే ఆయనకు తెలుసు.’ అంటూ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

*************************************

రాష్ట్రంలో శాటిలైట్‌ సిటీలను నిర్మిస్తాం..

***********************

ఏపీ పోలీసులలో క్రమశిక్షణరాహిత్యం పెరిగిపోతోంది..

************************

Updated Date - 2023-02-19T09:08:42+05:30 IST