Revanth Reddy: కేసీఆర్ మెడలు వంచి రైతుల రుణమాఫీ సాధించాం
ABN , First Publish Date - 2023-08-02T21:51:23+05:30 IST
రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ విజయమని, సీఎం కేసీఆర్ (CM KCR) మెడలు వంచి రైతుల రుణమాఫీ సాధించామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.
హైదరాబాద్: రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ విజయమని, సీఎం కేసీఆర్ (CM KCR) మెడలు వంచి రైతుల రుణమాఫీ సాధించామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.
"కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు, పోరాటాలు, ఒత్తిడి ఫలితంగానే నేడు సీఎం కేసీఆర్ రుణమాఫీ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం రాష్ట్ర చీఫ్ సెక్రటరీని కలిసి రుణ మాఫీ గురించి డిమాండ్ చేసింది. రుణమాఫీ అమలు చేయకపోతే బ్యాంక్‌ల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించాం. కేసీఆర్ మెడలు వంచి రైతుల రుణమాఫీ సాధించాం. కేసీఆర్ అసమర్థత వల్ల రుణమాఫీ నాలుగు సంవత్సరాలు ఆలస్యం అయ్యింది. రైతు రుణమాఫీ వడ్డీలతో సహా మొత్తం చెల్లించాలి. రైతులకు పూర్తి స్థాయిలో రుణ మాఫీ అందేవరకు కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండి పోరాటం చేస్తుంది." అని రేవంత్ రెడ్డి అన్నారు.