Ranga Reddy: మైలార్‎దేవ్‎పల్లిలో రెచ్చిపోయిన గంజా గ్యాంగ్..

ABN , First Publish Date - 2023-04-01T08:48:40+05:30 IST

మైలార్‎దేవ్‎పల్లి(Mylar Devpally) బృందావన్ కాలనీలో గంజా గ్యాంగ్(Ganja gang) రెచ్చిపోయింది. రావుల భాస్కర్, రావుల

Ranga Reddy: మైలార్‎దేవ్‎పల్లిలో రెచ్చిపోయిన గంజా గ్యాంగ్..

రంగారెడ్డి: మైలార్‎దేవ్‎పల్లి(Mylar Devpally) బృందావన్ కాలనీలో గంజా గ్యాంగ్(Ganja gang) రెచ్చిపోయింది. రావుల భాస్కర్, రావుల విక్రాంత్, రాజు, విశాల్‎పై దాడి చేస్తోన్న గ్యాంగ్‎ను ఆపడానికి వెళ్లిన రావుల భాస్కర్ పై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి..గంజా గ్యాంగ్ పరారైంది. ఆపడానికి వెళ్లిన మైనర్ రావుల, విక్రాంత్ మెడపై కత్తితో దాడి చేశారు. ప్రతిఘటించి తప్పించుకున్న యువకుడు నేరుగా పోలీసులకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాయపడిన వారిని పోలీసులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు 5 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-04-01T08:48:56+05:30 IST