Share News

Amit Shah: తెలంగాణ నుంచి ప్రధాని మోదీకి 10 సీట్లు బహుమతిగా ఇవ్వాలి.. కార్యకర్తలకు అమిత్ షా పిలుపు

ABN , Publish Date - Dec 28 , 2023 | 08:13 PM

పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతానికి పైగా ఓట్లు సాధించి.. తెలంగాణ నుంచి 10 సీట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహుమతిగా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఒక రోజు తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు ...

Amit Shah: తెలంగాణ నుంచి ప్రధాని మోదీకి 10 సీట్లు బహుమతిగా ఇవ్వాలి.. కార్యకర్తలకు అమిత్ షా పిలుపు

Amit Shah Telangana Tour: పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతానికి పైగా ఓట్లు సాధించి.. తెలంగాణ నుంచి 10 సీట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహుమతిగా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఒక రోజు తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో విచ్చేసిన అమిత్ షా.. కొంగరకలాన్‌లో నిర్వహించిన బీజేపీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే సాధించిందని.. అయితే తాజా ఎన్నికల్లో 8 సీట్లతో మెరుగైన ఫలితాలు సాధించామని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కచ్ఛతంగా 64 సీట్లు నుంచి 95 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే.. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 35 శాతానికి పైగా ఓట్లు సాధిస్తామని, 10 సీట్లకు పైగా గెలుస్తామని అమిత్ షా నమ్మకం వెలిబుచ్చారు. తమ ప్రభుత్వం మాదిగ సామాజిక వర్గానికి అండగా ఉంటుందని, ఆ వర్గానికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బీఅర్ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలేనని విమర్శించారు. తెలంగాణలో కుటుంబ పాలన నుండి విముక్తి పొందామని, దేశంలో కూడా కుటుంబ పాలన రాకుండా చూసుకోవాలని అన్నారు. 2024 జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కచ్ఛితంగా 350కి పైగా సీట్లు వస్తాయని.. ప్రతి కార్యకర్త పార్టీ నాది, దేశం మనది అనే భావనతో పని చేస్తే అఖండ విజయం సాధిస్తామని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం తొమ్మిది సంవత్సరాల్లో తొమ్మిది లక్షల కోట్లకు నిధులు ఇచ్చిందని అమిత్ షా అన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 08:13 PM