Congress: గాంధీ భవన్‌లో ప్రారంభమైన పీఏసీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

ABN , First Publish Date - 2023-07-23T17:16:44+05:30 IST

గాంధీ భవన్‌లో పీఏసీ (PAC) సమావేశం ప్రారంభమైంది. ఇన్‌ఛార్జీ ఠాక్రే అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది.

Congress: గాంధీ భవన్‌లో ప్రారంభమైన పీఏసీ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

హైదరాబాద్: గాంధీ భవన్‌లో పీఏసీ (PAC) సమావేశం ప్రారంభమైంది. ఇన్‌ఛార్జీ ఠాక్రే అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఏల్పీ నేత భట్టి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ ఇన్‌ఛార్జీలు, పీఏసీ మెంబర్లు హాజరయ్యారు. ప్రియాంక గాంధీ సభ, బస్సు యాత్ర, బీఆర్ఎస్ 30 శాతం కమీషన్‌పై పోరు, తదితర అంశాలపై చర్చిస్తున్నారు.

రాబోయే వంద రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలు, బస్సు యాత్ర విధివిధానాలను పీఏసీ ఖరారు చేయనుంది. పార్టీలో చేరికలు, నేతల మధ్య సమన్వయంపై చర్చించనున్నారు. ప్రభుత్వ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-07-23T17:25:18+05:30 IST