BJP MP Arvind: రాష్ట్ర బీజేపీపై ఎంపీ అర్వింద్ ఏమన్నారంటే..!

ABN , First Publish Date - 2023-05-25T15:47:22+05:30 IST

వచ్చే ఎన్నికల్లో యుద్ధ వాతావరణం ఉంటుందని చెప్పుకొచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో

BJP MP Arvind: రాష్ట్ర బీజేపీపై ఎంపీ అర్వింద్ ఏమన్నారంటే..!
Dharmapuri Arvind

నిజామాబాద్: రాష్ట్ర బీజేపీపై ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ (Dharmapuri Arvind) స్పందించారు. పార్టీలో ఎలాంటి లుకలుకలు లేవని.. ఇదంతా కేవలం మీడియా సృష్టేనని అర్వింద్ కొట్టిపారేశారు. నవీపేటలో జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చిచెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు. బీఆర్ఎస్‌తో యుద్ధానికి కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో యుద్ధ వాతావరణం ఉంటుందని చెప్పుకొచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు బీజేపీ గెలిచే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

షకీల్.. బోధన ఎమ్మెల్యేగా ఉండటం వల్ల అసాంఘిక శక్తులకు అడ్డగా మారిందని ఆరోపించారు. ఇందూర్.. దేశ ద్రోహులకు అడ్డగా మారిందని విమర్శించారు. సీఎం కేసీఆర్(CM KCR), జిల్లా మంత్రి, ఎమ్మెల్సీ కవిత, బోధన ఎమ్మెల్యే షకీల్.. దేశ ద్రోహులకు వత్తాసు పలుకుతున్నారని వ్యాఖ్యానించారు. జిల్లాను దేశ ద్రోహులకు అడ్డాగా మార్చడం దురదృష్టకరం అని అర్వింద్ ధ్వజమెత్తారు.

Updated Date - 2023-05-25T15:47:22+05:30 IST