Kavitha: కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
ABN , First Publish Date - 2023-11-06T18:43:22+05:30 IST
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆరెస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు.
నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని బీఆరెస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు.
"బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదు?. బీసీ కులగణన అంటేనే బీజేపీ అంటరానిదిగా భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణనను అడ్డుకుంది. బీజేపీ బీసీ సీఎం నినాదం శుష్క నినాదం, శూన్య నినాదం. అధికారంలోకి రాని పార్టీ బీసీని ముఖ్యమంత్రిగా ఎలా చేస్తుంది?. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్‌తో ఆ పార్టీ చేసిన పాపాలు తొలగిపోవు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు స్పందించడం లేదు?. కులవృత్తులకు చేయూత ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం బీసీల జీవితాలతో ఆడుకుంటుంది. బీసీలకు ఇంత అన్యాయం జరుగుతున్న ప్రశ్నించకుండా కాంగ్రెస్ పనికిరాని ప్రతిపక్ష పార్టీగా మారింది. మాది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు... బీసీల ప్రభుత్వం. ఎన్నికలొచ్చినప్పుడే బీసీలపై కాంగ్రెస్, బీజేపీలకు ప్రేమ."అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.