Share News

MIM: జూబ్లీహిల్స్‌, రాజేంద్రనగర్‌ ఎంఐఎం అభ్యర్థులు ఖరారు

ABN , First Publish Date - 2023-11-07T08:23:30+05:30 IST

మజ్లిస్‌ తరఫున జూబ్లీహిల్స్‌(Jubilee Hills) నుంచి మహ్మద్‌ రషీద్‌ ఫరాజుద్దీన్‌ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ

MIM: జూబ్లీహిల్స్‌, రాజేంద్రనగర్‌ ఎంఐఎం అభ్యర్థులు ఖరారు

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): మజ్లిస్‌ తరఫున జూబ్లీహిల్స్‌(Jubilee Hills) నుంచి మహ్మద్‌ రషీద్‌ ఫరాజుద్దీన్‌ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) ట్విట్టర్‌ (ఎక్స్‌) ద్వారా తెలిపారు. ఫరాజుద్దీన్‌ షేక్‌పేట డివిజన్‌ నుంచి రెండు పర్యాయాలుగా కార్పొరేటర్‌గా విజయం సాధించారు. 2014లో జూబ్లీహిల్స్‌ నుంచి ఎంఐఎం పోటీ చేసింది. ఇప్పుడు రెండో సారి పోటీకి సిద్ధమైంది. అలాగే, రాజేంద్రనగర్‌ అభ్యర్థిగా లంగర్‌హౌజ్‌ మాజీ కార్పొరేటర్‌ రవికుమార్‌ యాదవ్‌ను పార్టీ ప్రకటించింది.

Updated Date - 2023-11-07T08:23:31+05:30 IST