Share News

BJP: బీజేపీకి మరో కీలక నేత రాజీనామా

ABN , First Publish Date - 2023-11-22T13:44:40+05:30 IST

బీజేపీకి తెలంగాణలో ఏదో గ్రహణం పట్టినట్టుంది. పార్టీ నుంచి పోయే వారే తప్ప వచ్చేవారు లేరు. పార్టీ నుంచి ఇప్పటికే విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా పలువురు నేతలు రాజీనామా చేశారు. నేడు అశ్వద్దామరెడ్డి రాజీనామా చేశారు.

BJP: బీజేపీకి మరో కీలక నేత రాజీనామా

హైదరాబాద్ : బీజేపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలే విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి సీనియర్నే తలు రాజీనామా చేయగా.. బుధవారం మరో కీలక నేత అశ్వద్దామరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆర్టీసీ కార్మికుల సంఘం మాజీ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో అశ్వత్థామరెడ్డి కీలక పాత్ర పోషించారు. అయితే ఈటల రాజేందర్‌తో కలసి ఆయన బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ వనపర్తి టికెట్ ఇచ్చింది. కానీ ఆయన పోటీ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-11-22T14:03:57+05:30 IST